అన్వేషించండి

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Excise Department: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఆబ్కారీ శాఖ భారీగ ఆదాయాన్ని అందజేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.32 వేల కోట్ల రాబడి వచ్చింది. 

Excise Department: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఆబ్కారీ శాఖ పెద్ద దిక్కుగా నిలిచింది. వాణిజ్య పన్నుల శాఖ రికార్డు స్థాయిలో రూ.72 వేల కోట్ల ఆదాయం తెచ్చి పెట్టగా.. ఆబ్కారీ శాఖ రూ.31 వేల 560 కోట్ల రాబడితో సత్తా చాటింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. రికార్డు స్థాయిలో 42.99 కోట్ల లీటర్ల బీరు అమ్ముడుపోయింది. తెలంగాణ మందుబాబులు లిక్కర్ కంటే ఎక్కువగా బీర్లనే తాగేసినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో 70 శాతం హైదరాబాద్, దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, మెదక్ జిల్లాల్లోనే జరుగుతుంది. ప్రధానంగా హైదరాబాద్ లో లక్షలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉండడం, భారీ ఎత్తున స్థిరాస్థి వ్యాపారం జరగడం, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఫార్మా పరిశ్రమలు ఉండడం, పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వివిధ వ్యాపార, పర్యాటక, విద్య, వైద్య అవసరాల కోసం రాకపోకలు సాగించే వారు ఉండడం వల్ల మద్యం అమ్మకాలు భారీగా ఉంటున్నాయని తెలుస్తోంది. దీనికితోడు కొవిడ్ నుంచి పూర్తిగా బయట పడడం, వర్క్ ప్రం హోం నుంచి ఉద్యోగులు దాదాపు బయటకు వచ్చి పని చేస్తుండడంతో బీరు అమ్మకాలు భారీగా పెరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రతినెలా సగటున 2,900 కోట్లకు పైగా విలువైన మద్యం

అయితే తెలంగాణలో జరిగిన మొత్తం అమ్మకాల్లో అత్యధికంగ హైదరాబాద్ జిల్లాలో రూ.3739.42 కోట్లు, రంగారెడ్డి రూ.8410 కోట్లు, నల్గొండ రూ.3538 కోట్లు, మేడ్చల్ రూ.1326 కోట్లు, మెదక్ రూ.2917 కోట్లు, ఆదిలాబాద్ రూ.1438 కోట్లు, కరీంనగర్ రూ.2934 కోట్లు, ఖమ్మం రూ.2222 కోట్లు, మహబూబ్ నగర్ రూ.2488 కోట్లు, నిజామాబాద్ రూ.1652 కోట్లు, వరంగల్ రూ.3471 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, మద్యం లైసెన్స్ ల ద్వారా ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన రూ.36 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాల లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. రాష్ట్రంలో ప్రతినెలా సగటున రూ.2 వేల 900 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడుపోతుంది. 

సర్కారు ఖజానాకు సగటున రూ.2,630 కోట్ల ఆదాయం

ఈ మద్యం విక్రయాల ద్వారా ప్రతి నెల.. రూ.1,150 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వ్యాట్.. ప్రతినెలా ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.1450 కోట్లు వస్తున్నాయి. సర్కారు ఖజానాకు సగటున నెలకు రూ.2,630 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారుల అంచనా. అంటే మొత్తం 12 నెలల్లో దాదాపు రూ.31 వేల 560 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా రాష్ట్ర సర్కారును పెంచడంలో మందుబాబులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుల్లుగా తాగుతూ.. సర్కారు ఖజానాకు మస్తు పైసల్ వచ్చేలా చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, చివరకు చావులు, బాధల్లోనైనా తెలంగాణలో మద్యం తాగడం మర్యాద చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఇంత ఎక్కువ స్థాయిలో ఆదాయం వస్తోందని అంతా అనుకుంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget