Breaking News Telugu Live Updates: భైంసాలో జలవిలయం, ఇళ్లను ముంచెత్తిన వరద
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Background
భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ పవిత్ర క్షేత్రానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం వరద బీభత్సం సృష్టించింది. ఈ విషాదంలో 15 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 35 నుంచి 40 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. సహాయక చర్యలు శనివారం ఉదయం సైతం కొనసాగుతున్నాయి. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు బుధవారం తిరిగి ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలో మరోసారి వరద బీభత్సం చేసి అపార ప్రాణ నష్టం కలిగించింది. ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహయ చర్యలు కొనసాగిస్తున్నాయి. వరద నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. అగ్రిమెంట్ లో చెప్పిన దానికంటే భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయంటూ కొంతకాలంగా ఎలన్ మస్క్ వరుస ఆరోపణలు చేశారు. తాజాగా ట్విట్టర్ సంస్థ కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు మస్క్. నకిలీ అకౌంట్ల 5 శాతం కంటే తక్కువ ఉన్నాయని ట్విట్టర్ చెబుతున్నా... అది తప్పని మస్క్ వాదిస్తూ వచ్చారు. ట్విట్టర్ డీల్ ను హోల్డ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు మస్క్. అయితే ఇప్పుడు కంప్లీట్ గా డీల్ నుంచి బయటికి వస్తున్నట్లు ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది.
ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలోనూ భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం.
ఉత్తర కోస్తాంధ్ర నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాంలోనూ నేటి నుంచి నేటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటు రాయలసీమలోని కర్నూలు జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది.
నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్స్ 14వ ర్యాంకర్ కంటా సునేమయాపై ప్రణయ్ 25-23, 22-20తో గెలుపొందారు.
భైంసాలో జలవిలయం, ఇళ్లను ముంచెత్తిన వరద
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణాన్ని వరద నీరు చుట్టుముట్టంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరుకుంటుంది. గడ్డెన్న వాగు పొంగడంతో నీరు భైంసా పట్టణంలోకి చేరుతోంది. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.
మలేషియా మాస్టర్స్‌లో సెమీస్‌కు ప్రణయ్
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో 14వ ర్యాంకర్ కంటా సునేమయాపై ప్రణయ్ 25-23, 22-20తో గెలుపొందారు.





















