అన్వేషించండి

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై అవే ఆరోపణలు - పిళ్లై బెయిల్‌కు వ్యతిరేకంగా ఈడీ కౌంటర్ !

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి కవిత పేరు ప్రస్తావించింది ఈడీ. అయితే అన్నీ పాత ఆరోపణలే చేసింది. కొత్త విషయాలేం లేవు.

 

Delhi Liquor Case :   ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును  మరోసారిఈడీ ప్రస్తావించింది.  ఈ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన కౌంటర్‌లో తెలిపింది.  ఈ కేసులో నిందితుడు అయిన అరుణ్‌ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై మంగళవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో ఈడీ తరుపు లాయర్లు ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ జరిగిందని ఈడీ తరుఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.

ఈ స్కామ్‌కు సంబంధించి జరిగిన మీటింగుల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని కౌంటర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులతో కవిత ఫీనిక్స్ అనే కంపెనీ నుండి భూములు కొన్నారని ఈడీ లాయర్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరుణ్ రామచంద్ర పిళ్లైది కీలక పాత్ర అని.. అతడికి బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరుఫు లాయర్లు కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్‌పై తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని పిళ్లై తరుఫు లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు. దీంతో పిళ్లై బెయిల్ పిటిషన్ తదుపరి విచారణను స్పెషల్ కోర్టు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన రెండవ చార్జ్ షీట్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడ లేదు.  కవితను ప్రశ్నించినప్పటికీ ఇప్పటిదాకా సీబీఐ ప్రశ్నించిన వారి.. జాబితాలోనూ కవిత పేరు కనిపించలేదు. ఏప్రిల్‌ 25న అనుబంధ చార్జ్‌షీట్‌ సీబీఐ దాఖలు చేసింది. సుమారు 5వేల 700 పేజీలతో రెండో ఛార్జ్‌షీట్‌ వేసింది సీబీఐ. ఆ తర్వాత డిసెంబర్‌ 11న కవితను హైదరాబాద్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటిదాకా ప్రశ్నించి 89మంది వివరాల్ని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల వైఖరికి.. ఆమె విషయంలో స్పష్టమైన ఆధారాలు లేకనా? మరేదైనా కారణమా అని చర్చ జరుగుతోంది. 

మే నాలుగో తేదీన 4వ అనబంధ ఛార్జ్‌షీట్‌ వేసింది ఈడీ. 270 ప్రధాన పత్రాలు.. సుమారు 2వేల అనుబంధ పేజీలతో.. నాలుగో అదనపు ఛార్జ్‌షీట్‌ వేసింది ఈడీ. ఈనెల 30న ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై.. ఉత్తర్వులు వెలువరించనుంది ప్రత్యేక కోర్టు. రెండు ఛార్జ్‌షీట్లలోనూ ప్రధానంగా మనీష్‌ సిసోడియాపైనే.. సీబీఐ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది.   లిక్కర్‌ కేస్‌ దర్యాప్తులో భాగంగా గతంలో కవితను సీబీఐ, ఈడీ ప్రశ్నించాయి.   గతంలో మూడుసార్లు కవితను విచారణకు పిలిచి ఈడీ ప్రశ్నించింది. కవిత పేరు పలుసార్లు ప్రస్తావించినప్పటికీ ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలో.. కవిత పేరు లేదంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. నిందితులతో కవిత పలుసార్లు హైదరాబాద్‌, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవిత బినామీ అని పిళ్లై  అని ఈడీ వాదిస్తోంది.                           

టాప్ హెడ్ లైన్స్

Roof Restart Scheme: ఇందిరమ్మ ఇళ్లకు ‘రూఫ్ పునఃప్రారంభం’.. ఇంటికి రూ. 2 లక్షల సాయం.. వేగంగా లబ్ధిదారుల సర్వే!
ఇందిరమ్మ ఇళ్లకు ‘రూఫ్ పునఃప్రారంభం’.. ఇంటికి రూ. 2 లక్షల సాయం.. వేగంగా లబ్ధిదారుల సర్వే!
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
ACB Raids: అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ACB Raids: అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
Ramayana Collections : రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Embed widget