Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Resignation of Telangana Congress MPs : కాంగ్రెస్ తరపున గత లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు ముందుగానే రాజీనామా చేస్తున్నారు.
![Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ? Congress MP who won the last Lok Sabha elections on behalf of Congress are resigning early Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/0a89b0737c74cb5108b36793f90216271701774056195228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Congress MPs Resignatiom : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ.. ముగ్గురు ఎంపీలను కోల్పోతోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam kumar ( ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేయనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం చేసే ముందు లోకసభ సభ్యత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించాల్సి ఉంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు మరో ఏడు నెలల సమయం ఉంది. అయితే గత ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా గెలిచిన వారిని మాత్రం తొలి జాబితాతోనే సీటు దక్కింది. ఇది తొలి నుంచి ఊహిస్తున్నదే. ముగ్గురూ సీనియర్ నేతలు కావడం, పట్టున్న లీడర్లే కావడంతో తొలి నంుచి ఈ అంచనాలు వినపడుతున్నాయి.
మల్కాజిగిరి ఎంపీగా ప్రమాణానికి ముందే రేవంత్ రాజీనామా ?
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే. కొడంగల్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ఆ తర్వాత జరిగిన పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి విజయం సాధించారు. మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే ముందు రాజీనామా చేయనున్నారు.
గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా - ఇప్పుడు ఎంపీ పదవికి !
మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంతే. ఆయన నల్లగొండ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ మరోసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఘన విజయం సధించారు కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఆయన రెండుసార్లు అధికారంలోకి మాత్రం తేలేకపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేగానే కొనసాగనున్నారు. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.
భవనగిరి ఎంపీ కూడా రాజీనామా
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా సీనియర్ నేత. కోమటిరెడ్డి గత ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో భువనగిరి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి నల్లగొండ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ కు ఉంటే.. వారు ముగ్గురూ గెలిచారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయక ముందే వారు రాజీనమా చేయాల్సి ఉంది.
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు . ఆయన కూడా రాజీనామా చేయనున్నారు. బీజేపీ తరపున ఉన్న నలుగురు ఎంపీల్లో ముగ్గురు పోటీ చేశారు . కానీ ముగ్గురూ ఓడిపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)