అన్వేషించండి

Paddy Procurement: రబీ సంగతి తరువాత.. ముందు ఖరీఫ్ పంటలపై తేల్చండి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదు, రెండోది రబీ పంటపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ రైతులు ప్రస్తుతం రెండు సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఒకటి ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదు, రెండోది రబీ పంటపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తోడుదొంగళ్లా మారాయని ఎద్దేవా చేశారు. చివరి గింజ వరకు కొంటామని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ ఏ విషయాన్ని తేల్చలేదన్నారు. కేంద్రం మెడలు వంచుతానని ప్రకటించిన కేసీఆర్.. కేంద్రం ముందు మెడలు వంచుకున్నారా అని ప్రశ్నించారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సహకరించకపోతే.. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచినవా.. లేక ఆయన ముందు మెడలు వంచుకున్నావా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులపై కేసీఆర్‌కు నిజంగానే ప్రేమ ఉంటే జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టాలని సూచించారు. కేంద్రం రా రైస్ కొంటామని చెబుతోంది.. కానీ దాని వల్ల నూక ఎక్కువ వస్తుందన్నారు. ముడి బియ్యాన్ని చేయడం వల్ల ఎకరానికి రూ.10 వేల భారం పడుతుంది.

కేంద్రం స్పందించకుంటే రాష్ట్ర రైతులను రోడ్డు పడేస్తారా.. ఇప్పుడు మీ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ఎక్కడకు పోయారంటూ మండిపడ్డారు. చివరి గింజ వరకు నేనే కోంట అని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రం ముందు మెడలు వంచుకున్నాడని.. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ధర్నా చేయాలని సూచించారు. ఇతర పంటలకు మద్దతు ధర లేకనే రైతులు వరి వైపు మళ్లారు. రైస్ మిల్లర్ల చెప్పు చేతుల్లో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. 
Also Read: Telangana Devolopment : తెలంగాణ ఆదాయం అదుర్స్.. ఏడేళ్ల వృద్ధిపై ఆర్బీఐ లెక్కలు ఇవిగో..!

ముందు ఖరీఫ్ పంటను కొనండి..
తెలంగాణ ప్రభుత్వం రబీలో వేయాల్సిన పంటల గురించి ఉపన్యాసాలు ఇస్తోందని, అయితే ఖరీఫ్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైతులు కల్లాల్లో కష్టాలు పడుతుంటే.. సీఎం కేసీఆర్ ఢిల్లీలో, కలెక్టర్‌లు వాళ్ల ఇండ్లలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయశాఖ మంత్రి ఒక్క కల్లం అయినా తిరిగాడా.. సివిల్ సప్లై కమిషన్, వ్యవసాయ శాఖ కమిషన్ ఎక్కడకు పోయారంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పంజాబ్‌లో కాంగ్రెస్ కానీ.. కేంద్రంతో తాడోపేడో
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నూతన సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందన్నారు. తెలంగాణలో మాత్రం రైతు బంధు పేరుతో వారి రుణాలు ఎగ్గొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో వడ్డీ రాయితీ లేదు, విత్తన రాయితీ లేదు, రుణాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక లేదు. రూ.5 వేల కోట్లు కేటాయిస్తే రైతులకు ఏ సమస్యలు ఉండవని.. అలా చూసే బాధ్యత తనదేనన్నారు.
Also Read: నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం.. ధాన్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకుంటారా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Telangana El Nino Crop Loss Compensation: ఎల్‌నినో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు - కీలక నిర్ణయం తీసుకోనున్న రేవంత్ సర్కార్ - శుక్రవారం అఖిలపక్ష భేటీ!
ఎల్‌నినో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు - కీలక నిర్ణయం తీసుకోనున్న రేవంత్ సర్కార్ - శుక్రవారం అఖిలపక్ష భేటీ!
MIPCOM Cannes Telangana: కాన్స్ వేదికగా తెలంగాణ హవా - డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ఇండియాజాయ్ 9వ ఎడిషన్!
కాన్స్ వేదికగా తెలంగాణ హవా - డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ఇండియాజాయ్ 9వ ఎడిషన్!
Adilabad Gunugu Flowers Collection: ఆదిలాబాద్‌లో ఉపాధి కల్పిస్తున్న గూనుగుపూలు - బతుకమ్మ వేళ కూలీలకు కాసుల వర్షం!
ఆదిలాబాద్‌లో ఉపాధి కల్పిస్తున్న గూనుగుపూలు - బతుకమ్మ వేళ కూలీలకు కాసుల వర్షం!
Telangana Power Crisis: తెలంగాణలో ముదిరిన విద్యుత్ సంక్షోభం - యాదాద్రి పవర్ ప్లాంట్‌ పై ప్రత్యేక జాగ్రత్తలు
తెలంగాణలో ముదిరిన విద్యుత్ సంక్షోభం - యాదాద్రి పవర్ ప్లాంట్‌ పై ప్రత్యేక జాగ్రత్తలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget