CM KCR: తెలంగాణలో వేద పండితుల గౌరవ భృతి 5 వేలకు, ఆలయాల నిర్వహణ సాయం 10 వేలకు పెంపు
CM KCR: ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద ఇస్తున్న6 వేల నగదు సాయాన్ని 10 వేలకు, వేద పండితుల గౌరవ భృతిని 5 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

CM KCR: ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద ఇస్తున్న6 వేల నగదు సాయాన్ని 10 వేలకు, వేద పండితుల గౌరవ భృతిని 5 వేలకు పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి వేద పండితులకు గుడ్ న్యూస్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లి మండలం గోపనపల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ఇస్తున్న భృతిని రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. భృతిని పొందే అర్హత వయస్సు 75 ఏళ్ల వయసు పరిమితి నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు వివరించారు. అలాగే మరో 2796 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదే కాకుండా ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయాల నిర్వహణకు అర్చకులకు ఇస్తున్న నగదు సహాయం రూ. రూ.6000 నుంచి రూ.10000 పెంచారు. వేద పాఠశాలల నిర్వహణ కోసం రూ. 2 లక్షల వార్షిక గ్రాంట్‌గా ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని వెల్లడించారు.
విప్రహిత తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న సీఎం శ్రీ కేసీఆర్. Live: CM Sri KCR addressing the gathering after inaugurating 'Viprahitha Telangana Brahmana Samkshema Sadan' at Gopanpally, Hyderabad. https://t.co/wccgeEa7aC
— Telangana CMO (@TelanganaCMO) May 31, 2023
ఐఐటీ, ఐఐఎంలో చదువుతున్న బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింజేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. సంప్రదాయ పూజారుల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. సంస్కృత కవి మరియు వ్యాఖ్యాత కొలచల మల్లినాథ సూరి పేరుతో రాష్ట్రంలో మొట్ట మొదటి సంస్కృత విశ్వవిద్యాలయం మెదక్‌లో ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.






















