అన్వేషించండి

KTR: 'కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర' - సర్కారుకు రాజకీయాలే ముఖ్యమయ్యాయని కేటీఆర్ విమర్శలు

BRS Medigadda Tour: రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ట రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు నిజాలు తెలియజేసేందుకే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామన్నారు.

KTR Slams Telangana Government in Medigadda Issue: కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరిచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ 'చలో మేడిగడ్డ' పర్యటన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అంతే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షాకాలం వచ్చే లోపు ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడడానికే తాము చలో మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దని అన్నారు. 

'కాళేశ్వరంపై దుష్ప్రచారం'

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని.. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా దీన్ని కేసీఆర్ నిర్మించారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 'కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం లేనిది ఉన్నట్లు, ఏదో జరిగినట్లు చూపిస్తోంది. ప్రాజెక్టును జీర్ణించుకోలేకే దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి. మేడిగడ్డ బ్యారేజీలోని 84 పిల్లర్లలో  3 మాత్రమే కుంగాయి. లోపాలను సవరించాలి కానీ దీనిపై రాజకీయం చెయ్యొద్దు. రాజకీయాలు చేసేందుకే మేడిగడ్డను వాడుకుంటున్నారు.' అని మండిపడ్డారు.

మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు. పార్టీ అధినేత కేసీఆర్ మినహా కేటీఆర్, పోచారం సహా ఇతర ముఖ్య నేతలంతా ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. తొలుత మేడిగడ్డ సందర్శన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు.  ఆ తర్వాత అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజలకు నిజా నిజాలు తెలియజేసేందుకే ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. 

Also Read: Tatikonda Rajaiah: తాటికొండ రాజయ్య సతమతం! ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా - కాంగ్రెస్‌లోకి దారులు క్లోజ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tanikella Bharani : మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
This Week Theatrical Releases : సూర్య వీరభద్రుడు To కూల్ వర్క్ ఫ్రమ్ హోమ్ - ఒకే రోజు థియేటర్లలో 4 సినిమాలు
సూర్య వీరభద్రుడు To కూల్ వర్క్ ఫ్రమ్ హోమ్ - ఒకే రోజు థియేటర్లలో 4 సినిమాలు
Embed widget