హైదరాబాద్ తాగునీటి సమస్య, రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు వెంటనే కన్నెపల్లి మోటార్లను ఆన్ చేసి నీటిని తోడాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి రిపేర్లు కూడా చేయడం లేదని మండిపడ్డారు.
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
BRS Leaders Kannepalli Visit: బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు. నీళ్లన్నీ కళ్లముందే వృధాగా పోతున్నాయని ప్రజలు చెబుతున్నారన్నారు.

- కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలించిన బీఆర్ఎస్, మోటార్లు ఆన్ చేయాలంది.
- హైదరాబాద్, రైతులకు నీటి సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యమన్నారు.
- సమస్య పరిష్కరించకుంటే, సీఎం ఇంటిముందు నిరసనల హెచ్చరిక.
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి పంప్ హౌస్‌ను గురువారం బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది. హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు, రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు వెంటనే కన్నెపల్లి మోటార్లను ఆన్ చేసి నీటిని తోడాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు దాటుతున్నా ఇంకా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై దుమ్మెత్తి పోయడమే తప్ప, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
పంప్ హౌస్ వద్ద చిన్నపాటి రిపేర్లు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేవీ వివేకానంద మండిపడ్డారు. స్థానికులు చెబుతున్న ప్రకారం నీళ్లన్నీ కళ్లముందే వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మళ్లీ నీళ్ల ట్యాంకర్ల మాఫియా మొదలైందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించకపోతే నగర ప్రజలతో కలిసి ఖాళీ కుండలు, బిందెలతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
Also Read: బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
హైదరాబాద్ కు తాగునీటి సమస్య
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. జూన్ నెల నుంచే హైదరాబాద్‌కు నీటి సరఫరా తగ్గిందని, దీనిపై వాటర్ వర్క్స్ ఎండీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. కన్నెపల్లి వద్ద 17 మోటార్లు ఆన్ చేసి 2,600 క్యూసెక్కుల నీటిని పంప్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న 20 లక్షల ఎకరాలకు సాగునీటి ఎద్దడి వచ్చేది కాదన్నారు.
అంతేకాకుండా, మేడిగడ్డ వద్ద గతంలో బాంబ్ బ్లాస్ట్ శబ్దం వచ్చిందని అధికారి ఫిర్యాదు చేసినా దానిపై ఇప్పటివరకు విచారణ జరపలేదని, కుట్రపూరితంగా బాంబులు పెట్టి మేడిగడ్డ పిల్లర్లను పగలగొట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
Frequently Asked Questions
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేశారు?
కన్నెపల్లి నుండి నీటిని తోడకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు?
హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న 20 లక్షల ఎకరాలకు సాగునీటి ఎద్దడి వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మళ్లీ నీళ్ల ట్యాంకర్ల మాఫియా మొదలైందని హెచ్చరించారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రభుత్వంపై చేసిన ప్రధాన విమర్శలు ఏమిటి?
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై నిందలు వేయడమే తప్ప ఏమీ చేయడం లేదని విమర్శించారు. పంప్‌హౌస్ వద్ద చిన్న రిపేర్లు కూడా చేయడం లేదన్నారు.
మేడిగడ్డ వద్ద చోటుచేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఏమని అనుమానం వ్యక్తం చేశారు?
మేడిగడ్డ వద్ద బాంబ్ బ్లాస్ట్ శబ్దం వచ్చిందని అధికారి ఫిర్యాదు చేసినా విచారణ జరపలేదన్నారు. పిల్లర్లను కుట్రపూరితంగా బాంబులు పెట్టి పగలగొట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















