అన్వేషించండి

Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!

PM Narendra Modi Telangana Visit : తెలంగాణలో నవంబర్‌లో అమిత్ షా, డిసెంబర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేవంత్ ప్రభుత్వంపై పోరాటం, బూత్ లెవెల్ ప్లాన్స్‌తో బీజేపీ గేమ్‌ప్లాన్ అమలులోకి తెస్తోంది.

Telangana BJP Mission 2028 Strategy:  తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ  తన అసలైన రాజకీయ దూకుడును ప్రదర్శించేందుకు సిద్ధమైంది. సార్వత్రిక, శాసనసభ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో.. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో గట్టిగా పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం నూతన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్‌లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌లో తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు తుది షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ పెద్దలే నేరుగా మైదానంలోకి దిగుతుండటంతో కమలదళంలో సరికొత్త ఉత్సాహం నిండడమే కాకుండా, రాష్ట రాజకీయాల్లో వేడి ఒక్కసారిగా పెరిగింది.

ప్రధాన పోటీదారుగా ఎదిగేందుకు ప్రయత్నాలు            

రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆర్థిక సమస్యలు, విద్యుత్ డిమాండ్, ఎల్‌నినో సవాళ్లు, రైతు రుణమాఫీ హామీల అమలులో ఉన్న సాంకేతిక లోపాలను తమకు అనుకూలంగా మలచుకోవడమే బీజేపీ ప్రథమ లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు, ఓటమి తర్వాత అంతర్గత సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్  ఖాళీ చేసిన ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించి, కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ హైకమాండ్ ఈ కార్యాచరణను రూపొందించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోని వ్యతిరేకతను పక్కాగా ఒడిసిపట్టేందుకు ఢిల్లీ నాయకత్వమే స్వయంగా ఈ గేమ్‌ప్లాన్‌ను పర్యవేక్షిస్తోంది.

బూత్ స్థాయి నుంచి బలోపేతంపై దృష్టి    

నవంబర్‌లో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ముఖ్యంగా పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కమిటీల పనితీరు మరియు క్షేత్రస్థాయి వ్యూహాలపై దృష్టి సారించనున్నారు. నాయకుల మధ్య సమన్వయం పెంచడం, సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయడం ,  బూత్ స్థాయి సైనికులకు దిశానిర్దేశం చేయడం ఆయన పర్యటన ప్రధాన ఉద్దేశం. అసమ్మతికి తావులేకుండా, పార్టీ లైన్‌దాటి వ్యవహరించే నేతలకు గట్టి సందేశం ఇస్తూనే.. క్షేత్రస్థాయి కష్టపడే కార్యకర్తలకు నేరుగా బాధ్యతలు అప్పగించే దిశగా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.  డిసెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వేళ బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన వివిధ జాతీయ రహదారులు, రైల్వే లైన్లు , ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. "డబుల్ ఇంజిన్ సర్కార్" ద్వారా మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ, కేంద్ర నిధుల వినియోగంపై స్పష్టమైన విశ్లేషణను ప్రజల ముందు ఉంచడం ద్వారా భావోద్వేగపూరిత, నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.ట

బెంగాల్ తరహా దూకుడైన ప్లాన్ 

  తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న ఈ ముందస్తు వ్యూహం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. ఎన్నికల సమయం దాకా వేచి చూడకుండా, నామమాత్రపు విమర్శలతో సరిపెట్టకుండా రెండేళ్ల ముందే కేడర్‌ను సమరశంఖానికి సిద్ధం చేయడం ద్వారా ప్రత్యర్థులను తీవ్ర ఆత్మరక్షణలో పడేయవచ్చని భావిస్తున్నారు. మూడో ప్రత్యామ్నాయంగా మిగిలిపోకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే రేసును నిర్మించడం ద్వారా.. బీఆర్ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కే మేలు జరుగుతుందనే ప్రచారాన్ని ప్రజల మెదళ్లలో నాటేందుకు కమలదళం యత్నిస్తోంది.  ఢిల్లీ అగ్రద్వయం నేరుగా రంగంలోకి దిగుతుండటంతో తెలంగాణలో భాజపా తన అసలైన గేమ్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టినట్లయింది. భవిష్యత్తులో ఎలాంటి తాత్కాలిక పొత్తులు, ఆందోళనలు లేకుండా స్వశక్తితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యంగా కమలదళం పక్కా ప్లాన్లతో అడుగులు వేస్తోంది. రాబోయే నవంబర్, డిసెంబర్ పర్యటనలు తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి సంచలన పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Polls: నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
KCR National Politics Third Front Entry : కేసీఆర్ మిషన్ ఢిల్లీ - థర్డ్ ఫ్రంట్ దిశగా కదలికలు - కేటీఆర్ హింట్ ఇచ్చేశారా?
కేసీఆర్ మిషన్ ఢిల్లీ - థర్డ్ ఫ్రంట్ దిశగా కదలికలు - కేటీఆర్ హింట్ ఇచ్చేశారా?
AP Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు.. అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు.. అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
Chandrababu Pawan Kalyan Meeting: చంద్రబాబుతో ముగిసిన పవన్‌ కళ్యాణ్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై చర్చ
చంద్రబాబుతో ముగిసిన పవన్‌ కళ్యాణ్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై చర్చ
Advertisement

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
Jagan vs Sharmila: అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
AP Local Body Polls: నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
Bigg Boss Season 10 Today October 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Best Hybrid Cars: అత్యంత చవకైన హైబ్రిడ్ కార్లు ఇవి, కొనేముందు ఈ లిస్ట్ చూడండి
అత్యంత చవకైన Hybrid Cars, కొనేముందు ఈ లిస్ట్ చూసి డిసైడ్ చేసుకోండి
Aadarsha Kutumbam Trailer Review : ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ - వయలెంట్ యాక్షన్‌తో పాటే వెంకీ మార్క్ కామెడీ త్రివిక్రమ్ డైలాగ్స్
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ - వయలెంట్ యాక్షన్‌తో పాటే వెంకీ మార్క్ కామెడీ త్రివిక్రమ్ డైలాగ్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
Embed widget