అన్వేషించండి

Jubilee Hills ticket Azharuddin:అజహర్‌కే జూబ్లిహిల్స్ అసెంబ్లీ టిక్కెట్ - సోనియా, రాహుల్‌తో భేటీ - ఖరారైనట్లే?

Azharuddin: జూబ్లిహిల్స్ అసెంబ్లీ టిక్కెట్ అజహరుద్దీన్‌కే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. సోనియా, రాహుల్‌తో సమావేశం అయ్యారు.

Azharuddin will  Jubilee Hills Candidate: జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో  కాంగ్రెస్ టిక్కెట్ కోసం రేసు గట్టిగానే జరుగుతోంది. అయితే ఈ రేసులో  అజహరుద్దీన్ ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకు నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ తో పరిచయాలు ఉండటంతో అక్కడి నుంచే తన పేరును ఖరారు చేసుకుంటున్నారు. మంగళవారం సోనియాతో పాటు రాహుల్ గాంధీతోనూ అజహరుద్దీన్ సమావేశం అయ్యారు. సోనియా సాధారణంగా పార్టీ నేతలకు అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదు. కానీ అజహరుద్దీన్ కు ఇచ్చారు. ఫోటోలు దిగారు. రాహుల్ గాంధీ కూడా  అజహర్‌తో మాట్లాడారు. మర్యాదపూర్వకంగా కలిసిన అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ అంశంపై  హామీ పొంది ఉంటారని భావిస్తున్నారు. 

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ లో నుంచి మహ్మద్ అజహరుద్దీన్ పోటీ చేశారు. టిక్కెట్ ను చివరి క్షణంలో ఖరారు చేయడంతో పదహారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. చివరి క్షణంలో టిక్కెట్ కేటాయించినా గట్టి పోటీ ఇచ్చానని ఈ సారి తాను విజయం సాధిస్తానని అజహరుద్దీన్ అంటున్నారు. ఇటీవల ఆయన తానే పోటీ చేస్తానని ప్రకటించారు.  తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తనకు టికెట్ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు.  దానికి తగ్గట్లుగానే హైకమాండ్ తో అజహర్ భేటీ అయ్యారు. 

జూబ్లిహిల్స్ టిక్కెట్ రేసులో నాంపల్లీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, ఇర్ఫాన్ అజీజ్,   ఫహీమ్ కురేషీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు. మైనార్టీ ఎమ్మెల్యే కూడా లేరు. జూబ్లిహిల్స్ నుంచి మైనార్టీ నేతకే చాన్స్ ఇవ్వనున్నారు. ఈ సారి మజ్లిస్ మద్దతు కూడా లభించడం ఖాయం కావడంతో ఇక్కడ గెలిచే వారికి మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు. అందుకే పోటీ మరింత తీవ్రంగా ఉంది. ఈ పోటీలో హైకమాండ్ తో ఉన్న పరిచయాలతో అజహద్దీన్ ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఆయన వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున పార్టీ నేతలు పని ప్రారంభించారు. ఇంచార్జుల్ని నియమించారు.  ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయి లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు.   

 

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
KTR Complaints to Rahul Gandhi: రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Embed widget