By: ABP Desam | Updated at : 21 Mar 2023 06:14 PM (IST)
పేపర్ లీకేజీ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 11 కు వాయిదా ( Image Source : https://tshc.gov.in/ )
TSPSC పేపర్ లీకేజీపై హైకోర్టులో విచారణ ఏప్రిల్ 11కు వాయిదా పడింది. కేసుస్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేందుకు ప్రభుత్వానికి మూడువారాల సమయం ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణ ఏప్రిల్ 11కు వాయిదా పడింది.
పిటిషనర్ న్యాయవాది వివేక్ వాదనలు:
మొత్తం 6 ఎగ్జామ్స్ రద్దు చేసింది గవర్నమెంటు. 5 లక్షల మంది వివిధ పరీక్షలకు అప్లై చేశారు. 3 న్నర లక్షల మంది సివిల్స్ రాశారు. 25 వేల మంది ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 18 న ఐటీ మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వాఖ్యలు చేశారు. ఇద్దరు మాత్రమే పేపర్ లీక్ చేశారని ఎలా చెప్తారు? ఒక మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తాడు? పోలీస్ కాకుండా, సిట్ కాకుండా ఒక మంత్రి ఎలా ఇద్దరు మాత్రమే ఈ కేసులో ఉన్నారని చెప్తాడు? ఒకే మండలం నుండి 20 మంది టాప్ స్కొరర్లుగా ఎలా ఉంటారు? వెబ్ సైట్లో ఎక్కడా అభ్యర్థుల మార్కులు పొందపరచలేదు. చాలామందికి మార్కుల రూపంలో ఫేవర్ చేశారు. గతంలో వ్యాపం కేసును సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించింది.
అడ్వకేట్ జనరల్ వాదనలు:
ఈ కేసు విచారణ సిట్ పారదర్శకంగా చేస్తోంది. సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పిటిషన్ వేసిన వాళ్లకు ఈ ఎగ్జామ్ రద్దుతో సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ వేశారు. పిటిషన్ కు లోకస్ స్టాండీ లేదు కాబట్టి పిటిషన్ డిస్మిస్ చేయాలి. హైప్ కోసం ఇలాంటి పిటిషన్లు వేయడం కామన్ అయిపోయింది. పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో సిట్ 9 మందిని అరెస్ట్ చేసింది. సిట్ కొన్ని మండలాలకు సైతం వెళ్లి విచారణ చేస్తున్నది. 18 నుంచి 23 వరకు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. పబ్లిక్ డిమాండ్ మేరకే పరీక్షలు రద్దు చేశాం.
పిటిషనర్ వాదనలు
పిటిషనర్లలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్స్ కోసం పేపరయి రాసిన వాళ్ళు ఉన్నారు. లోకస్ స్టాండీ లేదని ఏజీ ఎలా చెబుతాడు.
తదుపరి విచారణ ఏప్రిల్ 11 కు వాయిదా
సిట్ దర్యాప్తు రిపోర్ట్ కోర్టుకు సమర్పించాలని కోరడంతో.. సబ్మిట్ చేయడానికి ప్రభుత్వం సమయం కోరింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వానికి అదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 11 కు వాయిదా వేసింది.
ఈనెల 23న సిట్ కార్యాలయానికి రేవంత్?
ఇదిలావుంటే, పేపర్ లీక్ కేసులో రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. 91 CRPC కింద నోటీసులు పంపింది. ఈనెల 23న సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. ఈనెల 19న మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పీపర్ లీకేజీ కేసుపై పలు అంశాలు మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించాలని నోటీస్ జారీ చేసింది. ఆరోపణ చేసిన మల్యాలమండలం అభ్యర్ధుల వివరాలు ఇవ్వాలని కోరింది సిట్. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని, మీ ఆధారాలు దర్యాప్తునకు ఉపయోగపడతాయని సిట్ వివరించింది. సిట్ ఏసీపీ రుతో రేవంత్ రెడ్డికి నోటీసులు అందాయి.
TSPSC: నేడే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?
TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!
Adilabad: దీనావస్థలో ఆ కుటుంబం, ఇంటి పెద్దదిక్కుగా మారిన మూగ బాలిక ! సాయం కోసం ఎదురుచూపులు
TS Group-1: రేపే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!