News
News
X

AP TS Mlc Elections : ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 23న పోలింగ్

AP TS Mlc Elections : ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ఆ స్థానాలకు మార్చి 23న పోలింగ్ జరగనుంది.

FOLLOW US: 
Share:

 AP TS Mlc Elections : తెలుగు రాష్ట్రాల్లో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా మార్చి 23న పోలింగ్, కౌంటింగ్ జరగనుంది.  తాజా షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఏపీలో 7, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఏపీలో నారా లోకేశ్, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, వరాహ వెంకట సూర్య నారాయణరాజు, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. ఎమ్మెల్సీ ఛల్లా భగరీథ రెడ్డి గత నవంబర్ లో మరణించారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది.  

తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ ల పదవీకాలం కూడా మార్చి 29తో ముగుస్తుంది. ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.  

 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు(వైసీపీ) 

1. పెనుమత్స సూర్యనారాయణ(క్షత్రియ సామాజిక వర్గం), విజయనగరం జిల్లా
2. పోతుల సునీత (బీసీ - పద్మశాలి), ప్రకాశం జిల్లా
3. కోలా గురువులు (ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్), విశాఖ జిల్లా
4. బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ - మాదిగ), తూర్పు గోదావరి జిల్లా
5. జయమంగళ వెంకటరమణ, (వడ్డీల సామాజిక వర్గం), ఏలూరు జిల్లా
6. చాందగిరి ఏసు రత్నం వడ్డెర (బీసీ), గుంటూరు జిల్లా
7. మర్రి రాజశేఖర్  (ఓసీ  -కమ్మ), పల్నాడు జిల్లా

స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో 1 నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల అయింది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23గా ఉంది. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉండనుంది.  స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏపీ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉన్నాయి. 

18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు,  గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది వైసీపీ. ఇందులో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు.  

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు

1. నర్తు రామారావు (బీసీ- యాదవ), శ్రీకాకుళం జిల్లా
2. కుడిపూడి సూర్యనారాయణ (బీసీ -శెట్టి బలిజ), తూ.గో జిల్లా:
3. వంకా రవీంద్రనాథ్ (ఓసీ - కాపు), ప.గో జిల్లా
4. కవురు శ్రీనివాస్ (బీసీ - శెట్టి బలిజ), ప.గో జిల్లా
5. మేరుగ మురళీ (ఎస్సీ - మాల), నెల్లూరు జిల్లా
6. డా.సిపాయి సుబ్రహ్మణ్యం (వన్య కుల క్షత్రియ), చిత్తూరు జిల్లా
7. రామసుబ్బారెడ్డి (ఓసీ - రెడ్డి), కడప జిల్లా
8. డాక్టర్ మధుసూదన్‌ (బీసీ - బోయ), కర్నూలు జిల్లా
9. ఎస్. మంగమ్మ (బీసీ - బోయ), అనంతపురం జిల్లా

* గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు*

1. కుంభా రవి బాబు (ఎరుకుల - ఎస్టీ), అల్లూరి సీతారామరాజు జిల్లా
2. కర్రి పద్మ శ్రీ  (బీసీ - వాడ బలిజ), కాకినాడ సిటీ

Published at : 27 Feb 2023 10:22 PM (IST) Tags: YSRCP MLA quota AP TS News MLC Elections AP MLC Elections

సంబంధిత కథనాలు

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Breaking News Live Telugu Updates: జేఎల్ పేపర్ 2 తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు

Breaking News Live Telugu Updates: జేఎల్ పేపర్ 2 తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

టాప్ స్టోరీస్

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?