Breaking News: నీట్-2021 ఫలితాలు విడుదల
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరగనున్న వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Background
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు (నవంబర్ 1) ఘనంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్19 నిబంధనలతో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 10 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరించనున్నారు. రాష్ట్రాన్ని సాధించుకోవడంలో తన ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఏపీ గవర్నర్ కార్యాలయంలో కూడా రాష్ట్రవతరణ వేడుకలు జరగనున్నాయి.
ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజు షెడ్యూల్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. నేటి ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్ టౌన్ లో నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలెపల్లి గ్రామం వద్ద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఉదయం 10.15 నిమిషాలకు ఎర్రమట్టి తండా గ్రామంలోకి పాదయాత్ర చేరుకుంటుంది. బోటిమేడ తండా క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగి 11.00 నిమిషాలకు పాలెం తండా క్రాస్ వద్దకు చేరుకుంటుంది.
చౌలా తండా క్రాస్ మీదుగా కొనసాగిన పాదయాత్ర 11.30 నిమిషాలకు చాకలిషేర్ పల్లి గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 3.00 గంటల వరకు భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఉమ్మపురం క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకోగా.. సాయంత్రం 4.00 గంటలకు గొల్లపల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. 5 గంటలకు సమైక్యానగర్ కు, 5.30 నిమిషాలకు కుర్మేడ్ గేట్‌కు చేరుకున్న పాదయాత్ర సాయంత్రం 6 గంటలకు అక్కడే ముగుస్తుంది.
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా పలు విద్యాసంస్థల్లో రెండోవిడత సీట్ల కేటాయింపు నేడు జరగనుంది. అక్టోబర్ 27న తొలివిడత సీట్లు కేటాయించగా.. సోమవారం నాడు రెండో విడతలో సీట్లు కేటాయిస్తారు. ఆ విద్యార్థులు నవంబర్ 2 నుంచి 3 వరకు ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు చెల్లించడం, సర్టిఫికేట్ల అప్‌లోడింగ్ చేయాలి. నవంబర్ 5లోపు జోసా అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. ఈ సంవత్సరం 6 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24తో మొత్తం సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగియనుంది.
ఎల్పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది
ఎల్పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్పీజీ సిలిండర్లపై రూ.266 మేర పెరిగింది. నవంబర్ 1 నుంచే ఇది అమలులోకి రానుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
నీట్ ఫలితాలు విడుదల
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్-యూజీ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల ప్రకటనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఫైనల్ కీ, పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయని విద్యార్థులు భావించారు. ఎన్‌టీఏ అధికారులు సోమవారం ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
టీఆర్ఎస్ వరంగల్ విజయ గర్జన సభ వాయిదా
టీఆర్ఎస్ వరంగల్ విజయ గర్జన సభ వాయిదా పడింది. నవంబర్ 15న నిర్వహించే విజయ గర్జన సభను టీఆర్ఎస్ వాయిదా వేసింది. సీఎం కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న దీక్ష దివాస్ సభను నిర్వహించనున్నారు.





















