Breaking News Live Telugu Updates: చంద్రబాబు సభలో అపశృతి, కాల్వలో పడి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న (డిసెంబరు 26) మాల్దీవులు, దానిని ఆనుకొని ఉన్న కొమోరిన్ ప్రాంతం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం బలహీనపడిందని తెలిపారు. ఏదైమైనప్పటికీ, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతం మీద సగటు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని చెప్పారు.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 3 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఇక్కడ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
చంద్రబాబు సభలో అపశృతి, కాల్వలో పడి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు
నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఇద్దరు కార్యకర్తలు చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కాల్వ నుంచి బటయకు తీసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
TS SSC Exams: ఏప్రిల్ 3 నుంచి తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్
ఏప్రిల్ 3 నుంచి తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్లు 6కు కుదించినట్లు చెప్పారు. వంద శాతం సిలబస్ తో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ విద్యార్థులకు పరీక్షలపై స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పరీక్షలకు సమయం 3 గంటలు కేటాయించారు.
ఎమ్మెల్యేల ఎర కేసు: సిట్ రద్దు చేసిన హైకోర్టు, కీలక విషయాలు ప్రస్తావన
ఎమ్మెల్యే కొనుగోలు కేసుల్లో జడ్జ్మెంట్లో కీలక విషయాలు ప్రస్తావించిన హైకోర్టు జడ్జి
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పే
ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమయింది
దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం
ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయి
దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికి చెప్పకూడదు
దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయి
సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫెర్ ఇన్వెస్టిగేషన్ లాగా అనిపించలేదు
దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదు
ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చు
బిజెపి పిటిషన్ మెయింటైనబుల్ కాకపోవటంతో పిటిషన్ డిస్మిస్
నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న
హైకోర్టు
జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు
ఎఫ్ ఐ ఆర్ 455/2022 సిబిఐ కు బదిలీ
సిట్ చేసిన దర్యాప్తు రద్దు
శంషాబాద్ రాయల్ విల్లాలో యువతి ఆత్మహత్య !
సివిల్స్ అభ్యర్థి ఆత్మహత్య కలకలం !
రంగారెడ్డి: శంషాబాద్‌లోని రాయల్ విల్లా కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పూజిత (27) అనే సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇబ్రహీంపట్నానికి చెందిన పూజిత శంషాబాద్ లో అద్దె గదిలో ఉంటూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో యువతి అద్దె ఇంట్లో చున్నీతో ఉరివేసుకుని చనిపోయింది. అయితే మహమ్మద్ అలీ అనే వ్యక్తి పూజితతో సన్నిహితంగా మెలిగేవాడని, తమ కూతురు మృతికి అతడే కారణం అంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయి రెండు, మూడు అయినందున మృతదేహం కుళ్లిపోయి వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ ఇంజనీంగ్ కాలేజీ నుంచి 2018లో బీటెక్ పూర్తి చేసింది పూజిత. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లాస్ లో ఇల్లు అద్దెకు తీసుకుని నాలుగు నెలలుగా నివాసం ఉంటోంది. అక్కడే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న పూజిత ఉరికి వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
President Droupadi Murmu: ఏకలవ్య స్కూల్ ను ప్రారంభించిన రాష్ట్రపతి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ పై సుమారు 13 ఎకరాలలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల (గురుకులం) ను బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం నుంచి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, సిర్పూర్ టి.ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జడ్పీ వైస్ చైర్మన్ కోనర్ కృష్ణారావు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.