అన్వేషించండి

Breaking News Live Telugu Updates: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు, మే 5లోపు లొంగిపోవాలని ఆదేశాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు, మే 5లోపు లొంగిపోవాలని ఆదేశాలు

Background

ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి  పశ్చిమ విదర్బ లోని ఆవర్తనం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజులులకు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 35 డిగ్రీల కన్నా తక్కువగా అక్కడక్కడ  నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు,  మెరుపులు, ఈదురు గాలులు (గాలి గంటకు 40 నుండి 50  కి. మీ. వేగంతో పాటు వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు,  మెరుపులు, ఈదురు గాలులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణలో నేడు కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వడగండ్లు కూడా పడే అవకాశం ఉంది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 91 శాతం నమోదైంది.

నిన్న ఇక్కడ భారీ వర్షాలు
తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట జిల్లాలు, జనగామ, ఖమ్మం, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్ లోని ఏకాంత ప్రదేశల్లో కొన్ని చోట్ల వర్షం కురిసింది. 

ఏపీలో నేడు వాతావరణం ఇలా
నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేగంగా గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 

‘‘గాలుల సంగమం మరింత బలపడి కర్నూలు, నంధ్యాల ప్రాంతం పైన విరుచుకుపడింది. దీని వలన ఉదయం నుంచి విపరీతం అయిన పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కర్నూలు నగరంతో పాటుగా నంధ్యాలలో కనిపించింది. ఈ వర్షాలు మరో రెండు గంటలు కొనసాగి తగ్గుముఖం పట్టనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.

13:33 PM (IST)  •  27 Apr 2023

BRS Meeting: అత్యంత గోప్యంగా సీఎం కేసీఆర్ BRS ప్లీనరీ సమావేశం

మంత్రులు, ఎమ్మెల్యేల వ్యక్తిగత భద్రత సిబ్బంది సైతం తెలంగాణ భవన్ బయటే.. 

 లోపలికి అనుమతించక పోవడంతో BRS భవన్ బయట చెట్ల కిందనే మీడియా, భద్రతా సిబ్బంది

11:57 AM (IST)  •  27 Apr 2023

Somesh Kumar IAS: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్‌కు ఆమోదం

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు వాలంటరీ రిటైర్మెంట్‌కు అనుమతి లభించింది. డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) వీఆర్ఎస్ అమోదం తెలిపింది. వీఆర్ఎస్ తర్వాత సోమేశ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరతారా లేక తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా చేరతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

11:34 AM (IST)  •  27 Apr 2023

Erra Gangireddy Bail Cancel: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు

వివేకానంద రెడ్డి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. మే 5లోపు సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వివేకా హత్య పెద్ద కుట్ర అని, పథక రచన, అమలు అంతా ఎర్ర గంగిరెడ్డే చేశారని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పారు. ఆయన బయట ఉంటే ఇతరులు ఎవరూ దర్యాప్తునకు సహకరించరని అన్నారు. గూగుల్‌ టేకౌట్‌ వంటి సాంకేతిక ఆధారాలున్నాయని, గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌లో సునీత తరపు న్యాయవాది కూడా ఇంప్లీడ్ అయ్యారు. వివేకాను హత్య చేయడానికి మిగిలిన ముగ్గురు నిందితులను ఎర్ర గంగిరెడ్డే ఉసిగొల్పారని, మీ వెనుక నేనుంటానని వారికి భరోసా ఇచ్చి ప్రోత్సహించారని సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది  తెలిపారు. అందువల్ల బెయిలును రద్దు చేయాలని కోరారు.

09:54 AM (IST)  •  27 Apr 2023

BRS General Body Meeting: నేడే బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్

నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే. ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. నేడు (ఏప్రిల్ 27) ఉదయం 11 గంటలకు జనరల్ బాడీ సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం11 గంటలకు పార్టీ జెండాను ఎగరేసి సీఎం  కేసీఆర్ సమావేశాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ నేతలకు కేసీఆర్ దేశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు అవుతారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget