News
News
వీడియోలు ఆటలు
X

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో తాను చేరినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని డి.శ్రీనివాస్ అన్నారు. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా గాంధీ భవన్ కు వెళ్లాలన్నారు. ఆ సందర్భంలో తనకు కాంగ్రెస్ కండువాలు కప్పారన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్న డీఎస్... తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే ఇదిగో నా రాజీనామా అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గేకు లేఖ రాశారు డీఎస్.  

పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్లు అని స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇలా సమాధానం చెప్పారు.

MLC Kavitha News: ఎమ్మెల్సీ కవిత పిటిషన్ మూడు వారాలకు వాయిదా - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీని, కవితను సుప్రీంకోర్టు ఆదేశించింది.

MLC Kavitha News: ఎమ్మెల్సీ కవిత పిటిషన్ మూడు వారాలకు వాయిదా - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీని, కవితను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Bhanu Prakash Reddy: అన్నరాంబాబు వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి

అన్న రాంబాబు.. ఇది వైసీపీ కార్యాలయం కాదు.. నువ్వు రాగానే గేటు తెరిచి సలాం కొట్టడానికి. శుక్ర, శని ఆదివారాల్లో కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకే దర్శనం అని తెలిసి 30 మందితో రావడం ఎంతవరకు సమంజసం? తిరుమలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. శ్రీవారి భక్తులకు అన్న రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలి’’ అని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. 

Vangalapudi Anitha: ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చెప్పుకుంటున్నారు - వంగలపూడి అనిత

అసమర్ధత సీఎం జగన్ రెడ్డి అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ గా పిలిచేవారు.. ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చెప్పుకుంటున్నారు. సైకో సీఎం జగన్ సీట్ లో కూర్చున్న తర్వాత.. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి, హత్య, అత్యాచార ఆంధ్ర ప్రదేశ్ గా చెప్పుకుంటున్నారు అని అన్నారు.

AP Governor: ఏపీ గవర్నర్ ని కలవనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

ఏపీ గవర్నర్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కలవనున్నారు. అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చేసిన తీర్మానంపై అభ్యంతరం చెప్పేందుకు సోమువీర్రాజు గవర్నర్ ని కలవనున్నారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అధికారిని మార్చండి - సుప్రీంకోర్టు

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ధర్మాసనం ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. 

CM Jagan Latest News: కాసేపట్లో ప్రకాశం జిల్లా కారుమంచికి సీఎం జగన్

సీఎం వైఎస్‌ జగన్‌ నేడు ప్రకాశం జిల్లాలో, రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మరికాసేపట్లో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకుంటారు. 11.15 గంటలకు కొండెపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌ బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తారు. నేడు సాయంత్రం రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను సీఎం జగన్‌  కలుస్తారు. 

28న మంగళవారం సాయంత్రం సీఎం జగన్ విశాఖపట్నానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌కు చేరుకుని రాత్రి 7 - 8 గంటల మధ్య జీ–20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘గాలా డిన్నర్‌’లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లి ఇంటికి చేరుకుంటారు.

Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో నేడు పిటిషన్ విచారణకు

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ జరుపుతున్న అధికారిని మార్చాలని దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ హత్య కేసులో ఏ - 5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌ వేశారు. దర్యాప్తు వేగంగా జరగడం లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ తులసమ్మ పిటిషన్‌లో కోరారు. గత సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేశారు. దర్యాప్తు పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. దీంతో దర్యాప్తు పురోగతి, పూర్వాపరాల విషయాలపై నివేదిక దాఖలు చేసినట్లు సమాచారం. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు. గత సోమవారం వాదనల సందర్భంగా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని కోర్టు సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని అడిగింది.

Piduguralla: పంట పొలాల్లోకి  లారీ దూసుకెళ్లి క్లీనర్ మృతి

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో పంట పొలాల్లోకి  లారీ దూసుకెళ్లింది. లారీ క్లీనర్ మృతి చెందారు. డ్రైవర్ నిద్ర మత్తుతో ప్రమాదం జరిగింది.. తెల్లవారు జామున పంట పొలాల్లోకి లారీ దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల  వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుండి హైదరాబాద్ బాలానగర్ కి లోడుతో లారీ బయలు దేరింది. కామేపల్లి బైపాస్ వద్ద డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో పంట పొలాల్లోకి లారీ దూసుకు వెళ్ళింది. ఈ సంఘటనలో క్లీనర్ భిక్షం మృతి చెందాడు. డైవర్ కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Kalvakuntla Kavitha: నేడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ
  • నేడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ
  • ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్‌
  • ఇప్పటికే కవిత పిటిషన్‌పై కేవియట్‌ దాఖలు చేసిన ఈడీ
Jagityala News: మద్యం మత్తులో యువతి వీరంగం

జగిత్యాల చౌరస్తాలో ఓ యువతి హల్చల్‌ చేసింది. ఆటో దిగిన తర్వాత డబ్బులు అడిగిన డ్రైవర్‌పై యువతి రాళ్లతో దాడికి దిగింది. అక్కడే ఉన్న కొందరు యువతి నిర్వాకాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. వివరాల్లోకి వెళితే సదరు యువతి కరీంనగర్‌ నుంచి గోదావరిఖనికి ఆటో ఎంగేజ్‌ మాట్లాడుకోగా రూ.1200కు బేరం కుదుర్చుకుని అక్కడి నుంచి బయల్దేరారు. మార్గమధ్యలో డీజిల్‌ కోసం డబ్బులు అడగ్గా గోదావరిఖనికి వెళ్లిన తర్వాత డబ్బులు ఇస్తానంది. తీరా గోదావరిఖని చౌరస్తాకు చేరడంతో తనవద్ద డబ్బులు లేవని డ్రైవర్‌ను బెదిరిస్తూ దుర్భాషలాడింది. అంతేకాకుండా అక్కడున్న రాళ్లతో డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. దీంతో అక్కడున్న ప్రజలంతా విస్తుపోయారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆటోడ్రైవర్‌కు డబ్బులు ఇప్పించారు. మద్యంమత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని స్థానికులు చెప్పారు.   

Siddipet Latest News: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకరు అక్కడికక్కడే దుర్మరణం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో ప్రమాదం చోటు చేసుకుంది. బైకు అదుపు తప్పి ఒకరు దుర్మరణం చెందా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Background

నిన్నటి ద్రోణి విధర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఉంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వద్ద కొనసాగుతోందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ & పరిసర ప్రాంతాలలో తుపాను ప్రసరణ సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తక్కువగా ఉంది.

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా (మార్చి 28న) తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

వెదర్ వార్నింగ్స్ ఇవీ
నేడు (మార్చి 27) తెలంగాణలోని ఒకటి లేదా రెండు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక 28 నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పారు.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 067 శాతం నమోదైంది.

ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, యానంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే గాలుల తీవ్రత అంతగా ఉండదని చెప్పారు.

ఢిల్లీలో వాతావరణం ఇలా..
గతంలో రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాల ప్రభావం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కనిపిస్తోంది. రెండేళ్లలో తొలిసారిగా మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీ గాలి ఇంత పరిశుభ్రంగా కనిపిస్తోంది. మార్చి 25 వరకు సగటు AQI 78కి చేరుకుంది. ఇది కాకుండా, ఎన్‌సిఆర్ ప్రాంతంలో కాలుష్యానికి సంబంధించి చాలా మెరుగుదల కనిపించింది. మొత్తానికి ఈ వర్షం ఉత్తర భారతదేశంలోని రైతులకు పెద్ద సమస్యగా మారింది.

ఢిల్లీ సహా ఎన్‌సిఆర్‌లో మంచి వర్షాలు కురిస్తే, అది అనేక విధాలుగా సహాయపడుతుందని పర్యావరణ నిపుణులు గతంలో ధృవీకరించారు. ముఖ్యంగా ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యానికి వర్షం ఉండాల్సిందే. ఢిల్లీలో సగటు AQI సంఖ్య 78గా నమోదైంది. మరోవైపు, నోయిడాలో AQI 74 మరియు గురుగ్రామ్‌లో AQI 70 ఎన్‌సిఆర్ ప్రాంతంలో పడిపోయింది. ఇది కాకుండా, గ్రేటర్ నోయిడాలో AQI 68 మరియు ఘజియాబాద్‌లో AQI 64 నమోదైంది. రాజధాని ఢిల్లీలోని అత్యంత కలుషిత ప్రాంతాలలో షాదీపూర్ మరియు ఆనంద్ విహార్‌లు ఉన్నాయి, ఇక్కడ AQI 177 మరియు 101 గణాంకాలు నమోదు అయ్యాయి.