News
News
వీడియోలు ఆటలు
X

Breaking News Live Telugu Updates: Crime news: పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
Tirumala News: శ్రీవారి సేవలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు, దర్శనానంతరం ఆలయం వెలుపల  మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ తన మనవరాలి పుట్టి వెంట్రుకలు స్వామివారికి సమర్పించడానికి తిరుమలకు వచ్చానని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే ఇరు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాలని అన్నారు.

NTR District News: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత
  • పోలీసుల వలయాన్ని ఛేదించుకుని బోసుబొమ్మ సెంటర్ కి చేరుకున్న టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు కొమ్ము బాబురావు
  • కొమ్ము బాబురావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మరికొద్దిసేపట్లో బోసుబొమ్మ సెంటర్ కి భారీగా తరలి రానున్న టీడీపీ నేతలు
  • పోలీసులు కళ్లుగప్పి బహిరంగ చర్చ వేదిక వద్దుకు వచ్చేందుకు సిద్దమైన టీడీపీ నేతలు
  • ఒక రోజు ముందు నుండే టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ లు చేసిన పోలీసులు
  • టీడీపీ ప్రభుత్వం, ఎంపీ కేశినేని నాని చేసిన  అభివృద్ధిపై చర్చకు వస్తామని ఎమ్మెల్యే కి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, వాసం మునియ్య, ఎస్సీ సెల్ నాయకులు
  • ఇంకా గృహ నిర్బందంలోనే మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య
Viveka Murder Case: నేటితో ముగియనున్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ సీబీఐ కస్టడీ

నేటితో ముగియనున్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల సీబీఐ కస్టడీ

నేడు మరోసారి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లను కస్టడీ లోకి తీసుకోనున్న సీబీఐ

చంచల్ గూడా జైలు నుండి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లను కస్టడీ లోకి తీసుకోనున్న సీబీఐ

ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రోజు జరిగిన పరిణామాల పై ఆరా తీసిన సీబీఐ

సాక్ష్యాల తారు మారు, ఎవిడెన్స్ టాంపరింగ్, లపై కూపి లాగిన సీబీఐ

40 కోట్ల డీల్ వ్యవహారంపై ప్రశ్నించిన సీబీఐ, అప్రూవల్ గా మారిన దస్తగిరి స్టేట్ మెంట్ పై పలు ప్రశ్నించిన సీబీఐ

ఈరోజు తో ముగియనున్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల కస్టడీ

Pending Bills In Telangana: పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి రాజ్ భవన్‌లో పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను ప్రభుత్వానికి తిరిగి పంపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఓ బిల్లును తిరస్కరించారు. డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును తిరస్కరించారు. మున్సిపల్ నిబంధనలు, ప్రవేటు వర్సిటీల బిల్లుపై గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ కోరారు.

Background

ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి దక్షిణ చత్తీస్‌గఢ్ నుండి విదర్భ, తెలంగాణ మరియు ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వడగళ్ళ తో పాటు రాగల మూడు రోజులు  ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో (30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇంకా తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 65 శాతం నమోదైంది. 

ఏపీలో ఎండలు ఇలా
ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గుంటూరు , పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేడ్కర్ కోరారు.


పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చెట్ల కింద ఉండవద్దని కోరారు. చెట్లపైనే పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంబేడ్కర్ తెలిపారు.

ఢిల్లీలో వాతావరణం ఇలా

గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆదివారం (ఏప్రిల్ 23) ఉపశమనం లభించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. రాబోయే ఒక వారం పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని కారణంగా వేడిగాలులు తగ్గుతాయి. అలాంటి పరిస్థితిలో, వేడి నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. 

పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అసోం సహా ఇతర రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన బలమైన గాలులు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు, ఆదివారం రానున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా వేడి నుండి ఉపశమనం లభిస్తుందని, దీని కారణంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.