Breaking News Live Telugu Updates: గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయి: ఎమ్మెల్సీ మాధవ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఆవరించి ఉన్న ద్రోణి ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్ వరకు రాయలసీమ, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇప్పటికే గత మూడు రోజులుగా పలు చోట్ల భారీ స్థాయిలో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో వాతావరణ స్థితి
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పారు. అలాగే, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక చలి విషయంలో రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండనున్నాయని తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు గంటకు (30-40 కి.మీ.) వేగంతో వడగళ్లతో కూడిన వర్షాలు సాయంత్రం లేదా రాత్రికి కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.0 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులకు అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల వర్షం సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఢిల్లీలో వాతావరణం ఇలా..
ఢిల్లీలో సోమవారం కేవలం మూడు గంటల్లో 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది గత మూడేళ్లలో మార్చి నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షపాతం. ఈ మేరకు వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దేశ రాజధానిలోని ప్రధాన వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో 6.6 మిమీ వర్షం నమోదైంది. మెరుపులు, వర్షంతో పాటు గంటకు 32 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
మార్చిలో మూడేళ్లలో 24 గంటల వ్యవధిలో అత్యధికంగా సోమవారం నాటి వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం సాయంత్రం దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అంతకుముందు రోజు, ఢిల్లీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా 27.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయి: ఎమ్మెల్సీ మాధవ్
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియా పాయింట్స్
గతంలో కూడా తమ పార్టీ ఓటమి చెందినా.. ఆ తర్వాత పుంజుకున్న సంఘటనలు ఉన్నాయి
ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయి
ఉత్తరాంధ్ర లో మాత్రమే బీజేపీ వైఫల్యం చెందింది
భవిష్యత్ లో ఎటువంటి అంశాలపై దృష్టి పెట్టాలనేది మా పెద్దలు సూచనలు చేశారు
ఏప్రిల్ 14 వరకు వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపడుతున్నాం
11సభ్యులతో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి బలోపేతం చేస్తాం
వీటికి సంబంధించి కొత్తగా యాప్ ను కూడా రూపొందిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా 15రోజుల పాటు అందరూ భాగస్వామ్యులు అయ్యేలా సూచిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది ఈ పనిలో నిమగ్నమవుతారు
బీజేపీ ఎఫ్పడూ వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తూనే ఉంది
ఇసుక, మైనింగ్, మద్యం వంటి అంశాలలో పోరాటాలు కూడా చేశాం
గతంలో ప్రజా పోరు పేరుతో వీధి సభలు పెట్టాం
రెండో విడత కూడా వీధి సమావేశాలు పెట్టి.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం
యువతను, ఉద్యోగులను, మహిళలను జగన్ మోసం చేశారు
రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండి.. జీతాలు కూడా సకాలంలో వేయని పరిస్థితికి తెచ్చారు
మే 1వ తేదీ తర్వాత ఛార్జిషీటు కార్యక్రమం చేపడతాం
ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తాం
వాటిని అమలు చేయకుండా ఏ విధంగా మోసం చేసిందీ వివరిస్తాం
ఈ ఛార్జిషీటు మొత్తం రెడీ అయ్యాక బహిరంగ సభలు నిర్వహిస్తాం
బీజేపీ పొత్తులకు సంబంధించి కూడా అనేక అంశాలు ప్రచారం జరుగుతున్నాయి
ఎపీలో బీజేపీ బలోపేతం కోసం తాము కృషి చేస్తాం
పొత్తులపై మాత్రం మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది.
యూట్యూబ్ చానెల్స్ పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన సినీ నటి హేమ
హైదరాబాద్
సైబర్ క్రైమ్:-
యూట్యూబ్ చానెల్స్ పై సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేసిన సినీ నటి హేమ..
తన భర్తతో ఉన్న ఫోటోలను ఫెక్ తంబ్ నైల్స్ పెట్టి.. అసత్య ప్రచారం చేస్తున్నారని పిర్యాదు.
సెలెబ్రిటీ లను టార్గెట్ చేస్తూ.. అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానెల్స్, వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు.
దీంతో పాటు ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీ లు చనిపోయారని దుష్ప్రచారం చేయడం పై ఆగ్రహం.
Earthquake in Kumrambheem Asifabad: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భూప్రకంపనలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి మండలాలలో మంగళవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. దీంతో గ్రామస్తులు భయంతో ఇళ్ళ నుండి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో ఒక్క సెకండ్ పాటు భూమి కనిపించింది. దీంతో స్థానిక పాఠశాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలతో తరగతి గదుల నుండి బయటకు పరుగులు తీశారు. ఉపాద్యాయులు విద్యార్థులను కాసేపు పాఠశాల మైదానంలో కూర్చోబెట్టారు. గతేడాది కూడా భూకంపం వచ్చిందంటూ వాపోతున్నారు.
నోటీసులు ఇవ్వకుండానే ఉద్దేశపూరకంగానే తప్పుడు ప్రచారం: కవిత
దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ తాను ఫోన్లు ధ్వంసం చేసినట్టు ఆరోపించారన్నారు కవిత. తనకు కనీసం సమన్లు ఇవ్వకుండా లేదా అడగకుండానే దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. అలాంటి సమయంలో ఎందుకు ఈ ఆరోపణలు చేసిందని నిలదీశారు. తనకు తొలిసారిగా మార్చి నెలలో విచారణకు రావాలని ఈడీ పిలిచిందన్నారు. కానీ గతేడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఆరోపించడం దురుద్దేశపూరకంగా తప్పుడు ఆరోపణే అన్నారు. ఇలాంటి లీకేజీలతో తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ
ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖను రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గతంలో తాను వాడిన ఫోన్లు ఈడీకి ఇస్తున్నట్టు చెప్పారు. ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా అని ప్రశ్నించారు.