Breaking News Live Telugu Updates: బీజేపీ ఎమ్మెల్యే రజాసింగ్ కు కరోనా పాజిటివ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలో్ సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.6 కిలోమీటర్ల మధ్య తుఫాను తక్కువ ప్రభావం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు గుజరాత్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, విదర్భలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్ గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్ లోకి జూన్ 19న ప్రవేశించాయని పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వాయువ్య బంగాళాఖాతం, ఛత్తీస్ గఢ్, ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, ఈశాన్య ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగే పరిస్థితులు ఉన్నాయి. కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడింది. నేడు యానాంతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయవాడ, గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో విస్తరిస్తున్న భారీ వర్షాలు నేరుగా కడప జిల్లాలొకి విస్తరించనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోనూ నేడు సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నిన్న సైతం రాష్ట్రంలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బీజేపీ ఎమ్మెల్యే రజాసింగ్ కు కరోనా పాజిటివ్
గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ కు కరోనా సోకింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో సోమవారం యూపీహెచ్సీ కార్వాన్లో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇటీవల తనను కలిసిన వారిని కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు
సీఎం కేసీఆర్ సతీమణికి స్వల్ప అస్వస్థత!
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో ఆమె జాయిన్ అయ్యారు. ఆమె స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆమెకు మోకాలికి యశోద ఆస్పత్రి డాక్టర్లు ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది.
Srikakulam Bear Attacks: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో మరోసారి ఎలుగుబంటి దాడి
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో మరోసారి ఎలుగుబంటి దాడి
ఏడుగురికి తీవ్రగాయాలు
పలాస ప్రభుత్వాసుపత్రికి తరలింపు , ఆరుగురి పరిస్థితి విషమం
వరుసగా సంభవిస్తున్న ఘటనలు. అటవీ అధికారుల నిర్లక్ష్యం అంటూ స్దానికులు ఆవేదన.
పొలం పనులు వెళ్లాలన్నా. ఇంట్లో నుంచి బయటికి రావాలి అన్న అని భయంగా ఉంది అంటూ ఆందోళన
ఎలుగుబంటి ని చూసి పరుగులు తీస్తున్న గ్రామస్తులు
నిన్న సైతం ఎలుగుబంటి దాడిలో కోదండరాం అనే రైతు మృతి
Chalo Narsipatnam: విశాఖపట్నం జిల్లాలోనూ టీడీపీ నేతల హౌస్ అరెస్టులు
‘చలో నర్సీపట్నం’కు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే తెలుగు దేశం నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అనకాపల్లిలో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావును గృహ నిర్బంధం చేశారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర బీసీ కన్వీనర్ మళ్ల సురేంద్ర నర్సీపట్నం వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
Dhuliaplla Nnarendra Arrested: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ నేతలు తలపెట్టిన చలో అనుమర్లపూడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని అనుమవర్లపూడి చెరువు వద్దకు చేరుకున్న టీడీపీ సీనియర్ నేతల ధూళిపాల్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది.