(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: గన్నవరంలో ఉద్రిక్తత, టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు.
తెలంగాణలో క్రమంగా చలి తగ్గుతోంది. నిన్న మూడు జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ అవ్వగా.. నేడు రాష్ట్రమంతా సాధారణంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక క్రమంగా ఎండాకాలం
‘‘తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఇందులో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. మరోవైపున రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కొనసీమ, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడా ఉండనుంది. కానీ రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
గన్నవరంలో ఉద్రిక్తత, టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి
గన్నవరంలో టీడీపీ ఆఫీస్ కు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఆఫీస్ ముందు ఉన్న కారుకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే వంశీపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్..
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ రోజు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది..
హైదరాబాద్ - చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది..
అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలను నిర్వహించారు.
తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించ లేదని అధికారులు తెలిపారు.
మరోవైపు, బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టు లోనే ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.
చెన్నై లో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించారు.
విమానాశ్రయానికి ఆయన లేట్ గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించ లేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపు లోకి తీసుకున్నారు.
మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
కుమారుడికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తండ్రి మోహనకృష్ణ
తారకరత్న పాడే మోసిన బాలకృష్ణ, నందమూరి సోదరులు
తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు
మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్
తారకరత్న అంతిమయాత్రలో వేలాదిగా పాల్గొన్న అభిమానూలు, తెదేపా కార్యకర్తలు
Prithvi Raj: కేసీఆర్ పవన్ కళ్యాణ్ కు ఆఫర్ ఇచ్చారని వస్తున్న వార్తలపై పృథ్వీ రాజ్ స్పందన
- తెలంగాణ సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్ కు ఆఫర్ ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన పృథ్వీ రాజ్
- పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలాంటి వార్తలు వేస్తున్నారు
- అప్పట్లో పృథ్వీ రాజ్ కు రూ. 200 కోట్లు ఇచ్చారని ఆరోపించారు..
- ఆ రూ.200 కోట్లు లెక్క పెట్టి రావడానికి ఇన్ని రోజులు పట్టింది..
- జనం కోసం పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్..
- అలాంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి నీచానికి పాల్పడే వ్యక్తి కాదు..
- ట్యాక్స్ కట్టడానికే రూ.9 కోట్ల రూపాయలు అప్పు చేశాడు పవన్ కళ్యాణ్..
- అలాంటి వార్తలు వేస్తే సర్క్యూలేషన్ వస్తాయని రాధాకృష్ణ భావించి ఉండవచ్చు..
- తారకరత్న విషయంలో లక్ష్మీ పార్వతి మాటలు బాధాకరం..
- అలాంటి మాటలు ఆమె మాట్లాడి ఉండకూడదు..
- లోకేష్ ఐరన్ లెంగ్ అంటూ ఆయన పాదయాత్ర వల్లే తారకరత్న చనిపోయాడు అని లింక్ చేస్తూ చెప్పడం బాధాకరం..
ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు
పెనుమత్స సూర్యనారాయణ రాజు- విజయనగరం
పోతుల సునీత- బాపట్ల
కోల గురువులు- విశాఖపట్నం
బొమ్మి ఇజ్రాయిల్- బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
జయమంగళ వెంకట రమణ- ఏలూరు
చంద్రగిరి ఏసు రత్నం- గుంటూరు
మర్రి రాజశేఖర్ రెడ్డి-పల్నాడు