News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Breaking News Live Telugu Updates:  తెలంగాణ గడ్డను బీజేపీ అడ్డాగా మారుస్తాం - బండి సంజయ్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
తెలంగాణ గడ్డను బీజేపీ అడ్డాగా మారుస్తాం - బండి సంజయ్ 

తెలంగాణ గడ్డ బీజేపీ అడ్డా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సభలో బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులను బయటకు పంపారని విమర్శించారు. తనకు గెలుపు ముఖ్యం కాదని ప్రజల కోసం పోరాటడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పేరు నుంచి తెలంగాణ తొలగించారని ఆరోపించారు. ఆంధ్రా సీఎంతో కుమ్మకై కమీషన్ల దందా చేస్తున్నారని ఆరోపించారు.  

 

 లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డులో పేలుడు, ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డ్ లో పేలుడు సంభవించింది. చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరగడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బ్లాస్ట్ ఎందుకు జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.  

మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో రెండవరోజు కొనసాగుతున్న సోదాలు

మార్గదర్శి చిట్ ఫండ్స్ అబ్డేట్...  

మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో రెండవరోజు కొనసాగుతున్న సోదాలు

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవిన్యూ ఇంటలిజెన్స్ అధికారుల తనిఖీలు

సొంత మీడియా తో అధికారులకు ఆటంకం కలిగిస్తున్న మార్గదర్శి యాజమాన్యం

అధికారుల తనిఖీలను వీడియో కెమెరాలతో చిత్రీకరణ

పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ లోని సమాచారం సేకరణ

నిభందనలకు విరుద్ధంగా ఫిక్స్  డిపాజిట్లు సేకరించినట్టు అనుమానం

ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మర్గదర్శి నిధుల మళ్లింపుపై ఆరా

మార్గదర్శి లో పంచనామా నిర్వహిస్తున్న అధికారులు

Chittoor Accident: ఆర్టీసి బస్సు అదుపు తప్పడంతో 12 మందికి గాయాలు

చిత్తూరు జిల్లాలో తృటిలో‌ పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూర్ నుండి కుప్పంకు వస్తున్న ఆర్టీసీ బస్సు కుప్పం మండలం, చందం వద్ద‌ ఆర్టీసీ‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో‌ 12 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా కొట్టింది. సంఘటన‌ స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Yadadri News: యాదాద్రిలో నూతన హెలికాప్టర్‌కి పూజలు

ప్రతిమ గ్రూప్ అధినేత, హైదరాబాద్ ఎయిర్‌లైన్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు కొత్త హెలికాప్టర్ (చాపర్) కొనుగోలు చేయగా, యాదాద్రి ఆలయంలో హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Kamareddy News: కామారెడ్డిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, గుహలోనికి వెళ్లిన కానిస్టేబుల్

కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయి తలకిందులుగా వెలాడుతున్న ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అతణ్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఓ కానిస్టేబుల్‌ను గుహ మరో వైపు నుంచి అత్యంత కష్టమ్మీద లోనికి పంపారు. చిక్కుకుపోయిన వ్యక్తికి పాలు, పండ్లులాంటివి పంపారు. లోపలి నుంచి బాధితుడ్ని లాగేందుకు ప్రయత్నించినా రావడం లేదని కానిస్టేబుల్ తెలిపారు. బాధితుడు మాట్లాడుతున్నారని తెలిపారు. అతని చేతికి గాయం అయిన కారణంగా రక్తం కారుతుందని కానిస్టేబుల్ బయటికి వచ్చి చెప్పారు.

Kamareddy News

కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయి తలకిందులుగా వెలాడుతున్న ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అతణ్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఓ కానిస్టేబుల్‌ను గుహ మరో వైపు నుంచి అత్యంత కష్టమ్మీద లోనికి పంపారు. చిక్కుకుపోయిన వ్యక్తికి పాలు, పండ్లులాంటివి పంపారు. లోపలి నుంచి బాధితుడ్ని లాగేందుకు ప్రయత్నించినా రావడం లేదని కానిస్టేబుల్ తెలిపారు. బాధితుడు మాట్లాడుతున్నారని తెలిపారు. అతని చేతికి గాయం అయిన కారణంగా రక్తం కారుతుందని కానిస్టేబుల్ బయటికి వచ్చి చెప్పారు.

Background

అరేబియా మహా సముద్రంలో ఉన్న వాయుగుండం పశ్చిమ దిశలో కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం ప్రస్తుతం లేదు. కానీ వచ్చేవారానికి ఓ అల్ప పీడనం బాగా బలపడే అవకాశం ఉంది. తుపాను మాత్రం ప్రస్తుతం బంగాళాఖాతంలో లేదు. అరేబియా సముద్రంలో ఉన్న అలజడి తెలుగు రాష్ట్రాల నుంచి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఏపీ, తెలంగాణపై అంతగా ప్రభావం చూపదు. మరో నాలుగు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. 

అరేబియా సముద్రంలో వాయుగుండంగా ఉన్న మాండస్ తుపాను భారత భూభాగానికి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఆంధ్రా, తెలంగాణ వైపుగా తేమగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు. దీనివల్ల ఉదయం సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

ఇటు బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలో కూడా సుమిత్రా జలసంధిపై రెండు రోజుల క్రితం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రెండు, మూడు రోజుల్లో పశ్చిమ దిశగా పయనించి శ్రీలంకకు సమీపంలో అల్పపీడనంగా మారొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

శ్రీలంక సమీపంలోకి వచ్చిన అల్ప పీడనం తమిళనాడు వైపుగా గానీ, శ్రీలంక వైపుగాగానీ, శ్రీలంక కింది భాగం నుంచి కూడా వెళ్లే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తమిళనాడు వైపు ట్రాక్ తీసుకుంటే తప్పకుండా ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. మాండస్ తుపాను సమయంలో పడిన భారీ వర్షాల తరహాలో వర్షాలు ఉంటాయి. రెండో ట్రాక్ తీసుకుంటే స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది. మూడో ట్రాక్ తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు బలపడి ఈనెల 19వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇక తూర్పుగాలుల ప్రభావంతో మంగళవారం రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు మాత్రం ఏపీలో పొడి వాతావరణమే నెలకొని ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.

టాప్ స్టోరీస్

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam

Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
×