Breaking News Live Updates: సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల నీటి ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారింది. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాని తాకింది. మరో 24 గంటలల్లో విదర్బ మీదుగా మధ్యప్రదేశ్ ని తాకనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో మరో రెండురోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నిన్న ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిశాయి.
నేడు మరికొన్ని గంటల్లో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. వైజాగ్ నగరంతో పాటుగా అనకాపల్లి, పెందుర్తి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ నగరం సివారు ప్రాంతాలు (గాజువాక, పెందుర్తి వైపు), విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్ష సూచనతో ఎన్.టీ.ఆర్, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ లోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. బిల్డింగ్ లోని పై అంతస్తులో ఉన్న లాడ్జి పొగ వ్యాపించింది. లాడ్జి రూమ్ లలో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్
Mlc Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా సోకింది. గత రెండు మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత, పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
Tirupati News: కలెక్టరేట్ ఆవరణలో దంపతుల ఆత్మహత్యాయత్నం
తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. తమ భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా తాసిల్దారు వేధిస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సాయినగర్‌కు చెందిన భార్యభర్తలు నాగార్జున, భవాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వీరిద్దరిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో దంపతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సూళ్ళూరుపేట సాయినగర్‌కు చెందిన నాగార్జున, భవాని దంపతులు సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో స్పందన కార్యాక్రమానికి వచ్చారు. పాసు పుస్తకాల జారీలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సూళ్ళూరుపేట తాసిల్దారు చంద్రశేఖర్ తమకు న్యాయం చేయలేదని కలెక్టరేట్ ఆవరణంలోనే భవాని పురుగుల మందు తాకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పక్కనే ఉన్న ఆమె భర్త నాగార్జున చెయ్యి కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వీరిద్దరినీ చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరు రుయా ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కానిస్టేబుల్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గింపు: అసెంబ్లీ లో కెసిఆర్ ప్రకటన
తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు.
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్, 360 కిలోల గంజాయి స్వాధీనం
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
విశాఖపట్నం వైపు నుండి హైదరాబాద్ ద్వారా కర్ణాటక , మహారాష్ట్ర లకు గంజాయి సరఫరా చేస్తున్నారు
చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మూడు కార్లలో 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము..
ఏపీ తో పాటు కర్ణాటక , మహారాష్ట్ర కు చెందిన ఆరుగురు డ్రగ్స్ పెడ్లార్ లను అదుపులోకి తీసుకున్నాము..
నిందితుల్లో కొందరు గతం లోనూ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు..
2,3 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి...20 వేలకు కిలో అమ్ముతున్నారు..
మేము స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి 2 లక్షల విలువ వుంటుంది.
ఎన్ డీ పీ ఎస్ చట్టం 31(A) చాలా బలమైనది...
ఈ కేసులో ఉరిశిక్ష కూడా పడే అవకాశాలు వున్నాయి..
గంజాయి వాడుతున్న వారి కేసులో కొన్ని సార్లు కౌన్సిలింగ్ లు కూడా మాకు ఇబ్బందిగా మారాయి. అందుకే గోప్యంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాము..
మాదక ద్రవ్యాల పై తెలియని వాళ్ళు కూడా... విపరీత ప్రచారం ద్వారా ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు.