అన్వేషించండి

Breaking News Live: పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం 

Background

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Light To Moderate Rain Or Thundershowers)ఉంటాయని, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్నం తెలిపారు. వేసవికాలంలో నమోదయ్యే వర్షాలు కనుక, పిడుగు పాటు అవకాశాలు ఉన్నాయని  ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు వరకు ఆవరించి ఉన్నట్లు తెలిపారు. మరో అల్పపీడన ద్రోణి కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ, ఏపీలో నిన్న సాయంత్రం కురిసిన వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి. ఎండల నుంచి తెలుగు రాష్ట్రాల వారికి ఊరట కలుగుతోంది.

తెలంగాణలో మరో రెండురోజులు వర్షాలు.. 
తేలికపాటి జల్లులు కురవడంతో హైదరాబాద్ నగరవాసులకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. కొన్ని రోజుల కిందటి వరకు 41 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 36 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో రెండు రోజులపాటు నగరంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వేసవి వర్షాలు కనుక పిడుగులు పడే అవకాశం అధికంగా ఉంటుందని, ప్రజలు చెట్ల కింద, పాడుబడిన ఇళ్ల కింద తలదాచుకోవడం చేయకూడదని హెచ్చరించారు.

ఏపీలో ఇక్కడ వర్షాలు.. అక్కడ ఎండలు
ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలతో పాటు యానాంలలో చలి గాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉమ్మండి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేసవి తాపానికి ప్రజలు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ బారిన పడుతున్నారు. రాయలసీమ ప్రజలు రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచినీళ్లు తాగాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. వేసవి వర్షాల్లో పిడుగుపాటు అవకాశం అధికమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు మాత్రం ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

16:00 PM (IST)  •  23 Apr 2022

పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం 

అనకాపల్లి జిల్లా  పరవాడ జవహర్ లాల్ ఫార్మా సిటీ SNF ఫార్మాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా  మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రాణానష్టం లేకపోవడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. భారీగా మంటలు ఎగసి పడడంతో సమీప గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై పరవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. 

09:46 AM (IST)  •  23 Apr 2022

Praja Sangrama Yatra: బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజు షెడ్యూల్

Praja Sangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజు షెడ్యూల్ (23-4-2022)

ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం వనపర్తిజిల్లాలోకి ప్రవేశించింది. శనివారం మాదాసి కురువ, మున్నూరు కాపు సంఘాల  నాయకులతో బండి సంజయ్ భేటీ అవుతారు. ఉదయం 10 గంటలకు శిబిరం వద్ద పాదయాత్ర ప్రారంభం అవుతుంది. కృష్ణం పల్లి ఎక్స్ రోడ్ వద్ద బండి సంజయ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. కృష్ణం పల్లి జెండా ఆవిష్కరణ పాదయాత్ర 100 కి.మీ పూర్తయిన సందర్బంగా బండి సంజయ్ సమక్షంలో కార్యకర్తలు కేక్ కటింగ్ చేయనున్నారు. 

ఈర్లదిన్నె- 
జండా ఆవిష్కరణ, 
రైతులు గ్రామసభ.

మిట్టనందిమళ్ళ- సన్మానం, మహిళల తో హారతి,
జండా ఆవిష్కరణ, రచ్చబండ.

మిట్టనందిమళ్ళ తర్వాత భోజన తర్వాత భోజన విరామం.

09:40 AM (IST)  •  23 Apr 2022

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో గుర్తింపు యునియన్ ఎన్నికలు ప్రారంభం

* విశాఖ స్టీల్ ప్లాంట్ లో గుర్తింపు యునియన్ ఎన్నికలు ప్రారంభం

* ఉదయం 5 గం. నుండి సాయంత్రం 4 గం వరకు ఎన్నికలు

* ప్రధానంగా  ఐఎన్ టీయూసీ, సింహం.. ఏఐటీయూసీ గులాబీ... సీఐటీయూ గంట గుర్తుపై పోటీ

* 10,590 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

* స్టీల్ ప్లాంట్ లో 13 పోలింగ్ బూత్ లు, బయట ట్రైనింగ్ సెంటర్ లో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు

* ఎన్నికలు సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు

09:30 AM (IST)  •  23 Apr 2022

Tirumala Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు

తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. ఆలయం వెలుపల సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. వేసవి సమయంలో తిరుమలలో భక్తులు రాక అధికంగా ఉంటుందన్నారు..మే నెల దగ్గర వస్తున్న క్రమంలో సామాన్య భక్తుల కోసం చలువ పందిళ్ళు వంటి సౌఖర్యాలు టిటిడి ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు.

09:28 AM (IST)  •  23 Apr 2022

Jagityal Accident: జగిత్యాల జిల్లాలో ప్రమాదం

జగిత్యాల - కరీంనగర్ మార్గంలో నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. పూడూర్ దాటిన తర్వాత  లారీని రెండు వ్యాన్లు ఢీ కొట్టాయి. ఆ వెంటనే కోడి గుడ్ల వ్యాను కూడా అక్కడ అదుపుతప్పి బోల్తా పడింది.  దీంతో స్థానికులు కోడి గుడ్లను ఎగబడి తీసుకున్నారు. ఈ  ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాలను అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Unstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP DesamAus vs Ind Sydney Test Day 3 Highlights | సిడ్నీ టెస్టులో భారత్ కు పరాభవం | ABP DesmISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
Human Metapneumovirus : శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
Daaku Maharaaj Ticket Price Hike: ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
Embed widget