(Source: ECI/ABP News/ABP Majha)
Plastic Ban: శ్రీశైలం వెళ్లే రోడ్డులో ప్లాస్టిక్ బ్యాన్, అధికారుల కీలక నిర్ణయం - అమలు ఎప్పటినుంచంటే!
Amrabad Forest Reserve: మీరు శ్రీశైలం వెళ్తున్నారా? మీరు వెంటబెట్టుకుని తెచ్చిన వాటర్ బాటిల్ ప్లాస్టిక్ అయితే మిమ్మల్ని చెక్ పోస్టు దాటి వెళ్లనివ్వరు. జులై 1 నుంచి నిషేధం విధించారు.
Amrabad Forest Reserve శ్రీశైలం వెళ్లే వారికి అలర్ట్. ఇకనుంచి ఈ మార్గంలో వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ నిషేధించారు. అయితే ఈ నిర్ణయం జులై 1 నుంచి అమలులోకి వస్తుందని, దీనిపై అవగాహనా పెంచుకోవాలని ప్రజలకు సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత జోన్ గా ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అందుకు అణుగుణంగా నాగర్ కర్నూల్ జిల్లా యంత్రాంగం ఇప్పటికే చర్యలలకు ఉపక్రమించింది. జూలై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అధికారులు స్థానికులు, దుకాణ దారులు, ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ ని వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో వన్ టైమ్ యూస్ ప్లాస్టిక్ ని, మల్టీ లేయర్ ప్లాస్టిక్ ని వాడకూడదు.. నీళ్ల బాటిళ్లు, బిస్కట్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు ఇవేమీ పులుల అభయారణ్యంలోకి తీసుకెళ్లేందుకు వీల్లేదు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉంది. శ్రీశైలం వెళ్లే వరకూ ఈ అభయారణ్యం పరిధిలోనే ప్రయాణం సాగుతుంది. ఈ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ను ఈ మార్గంలో వదిలేస్తున్నారు. దీంతో వణ్య ప్రాణులతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది. ఇలా వదిలేసిన ప్లాస్టిక్ ని అటవీ శాఖ మనుషులను పెట్టి మరీ ఏరించి ఆ చెత్తను రీసైక్లింగ్ కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. వణ్య ప్రాణులకు, పర్యావరణానికి హాని కలగకుండా చూసేందుకు, ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ ఏరాల్సిన పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తాజా చర్యలకు ఉపక్రమించింది.
ఇకపై అసలు ప్లాస్టిక్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పేపర్ ప్లేట్లు వంటి వాటితో ఈ అభయారణ్యం పరిధిలోకి ఎంటర్ కాలేరు. అడవిలోకే కాదు.. ఆ రూట్ లోనే అసలు ప్లాస్టిక్ ను అనుమతించకుండా చర్యలు తీసుకోనున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దుకాణదారులకు.. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం స్థానిక అధికారులు చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై జనం నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే ఇటీవల నీటిని క్యారీ చేసేందుకు, తినుబండారు, ఆహార పదార్థాలు క్యారీ చేసేందుక ప్లాస్టిక్ పై బాగా ఆధారపడినందును ప్రభుత్వమే ఈ శ్రీశైలం వెళ్లే దారిలో అభయారణ్యం మొదలయ్యాక ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరుతున్నారు. ఇందుకు అణుగుణంగా ప్రభుత్వం సైతం గాజుబాటిళ్లలో నీటిని ఉంచేందుకు, విస్తరాకులు వంటివి అందుబాటులో ఉంచేదుకు చర్యలు తీసుకుంటోంది. చిన్న చిన్న దుకాణ దారులు జీవనాధారం కోల్పోనున్నప్పటికీ వారి సహకారం కోరుతోంది.
ఒకరు వాడి పడేసిన ప్లాస్టిక్ ఇంకొకు ఏరడం హేయం
‘‘అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జూలై 1 నుంచి ప్లాస్టిక్ నిషేధించాం. ఈ అభయారణ్యంలో 30 పులులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్ని జంతువులను ద్రుష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ బాటిళ్లు, మల్టీ లేయర్ ప్లాస్టిక్ పి నిషేధించాం. అందరూ సహకరించాలి. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి మీద ఏడాది వ్యవధిలో దాదాపు 17 వేల కిలోల ప్లాస్టిక్‌ను కలెక్ట్ చేశాం. ఒక మనిషి వాడి పారేసిన వ్యర్థాలు మరో మనిషితో ఏరించడం హేయం’’ అని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్. క్షితిజ (ఐఎఫ్ఎస్) అన్నారు.
Amrabad Tiger Reserve is going completely plastic-free from 1st July 2024. Let's work together to protect this beautiful landscape of Nallamalla and its wildlife. #PlasticfreeATR @TelanganaCMO @KMuraliSurekha @dobriyalrm @pargaien @HiHyderabad @deespeak @upasanakonidela pic.twitter.com/IafUjfaIMk
— Amrabad Tiger Reserve (@AmrabadTiger) June 23, 2024
‘‘ జూలై 1 నుంచి అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గ్రా ప్రకటించాం. దీన్ని అనుసరించి ఈ ప్రాంతం కుండా వెళ్లే శ్రీశైలం భక్తులు, అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్టు కి వచ్చే ప్రయాణికులు ఈ ప్రాంతంలో బ్యాన్ చేసిన.. పెట్ బాటిల్స్, మల్టీలేయర్ ప్లాస్టిక్, బిస్కెట్ కవర్లు, చిప్స్ కవర్లు వంటివి తీసుకురావద్దు’’ అని నాగర్ కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్ గోపిడి (ఐఎఫ్ఎస్) కోరారు.
Plastic is banned inside Amrabad Tiger Reserve! Don't bring plastic if you are traveling from NH 765. Lets strengthen environmental ecosystem by changing our habits. #PlasticFreeAmrabad @KMuraliSurekha @HarithaHaram @HiHyderabad @Akshayswitcheko @nstr_tiger @journo_laxman pic.twitter.com/vWvNqSHsVn
— Amrabad Tiger Reserve (@AmrabadTiger) June 25, 2024
‘‘ప్రకృతిని కాపాడుకోవడానికి అందరం కలిసి అద్భుతాలు చేయొచ్చు. ఆమ్రాాబాద్ పులుల అభయారణ్యాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందకు సింగిల్ యూస్, మల్టీ లేయర్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాాం’’ అని తెలంగాణ వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ మోహన్ పార్గేయిన్ ఐఎఫ్ఎస్ కోరారు.
Together we can do wonders for conservation of nature .
— Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) June 22, 2024
Let’s be an active partners for making @AmrabadTiger plastic free by avoiding use of Single Use Plastic and Multi layer plastic https://t.co/WOfqeFjusd