Hyderabad News: జస్ట్ మిస్ - డ్రైవర్ అప్రమత్తతతో మహిళకు తప్పిన ప్రమాదం, లేకుంటే?
Woman Missed Accident: ఓ మహిళ ఆర్టీసీ బస్ ఫుట్ బోర్డు వద్ద ప్రయాణిస్తుండగా.. అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ క్రమంలో డ్రైవర్ అప్రమత్తతతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.
![Hyderabad News: జస్ట్ మిస్ - డ్రైవర్ అప్రమత్తతతో మహిళకు తప్పిన ప్రమాదం, లేకుంటే? a woman missed an accident by alertness of the rtc bus driver Hyderabad News: జస్ట్ మిస్ - డ్రైవర్ అప్రమత్తతతో మహిళకు తప్పిన ప్రమాదం, లేకుంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/20/a9aef2e15d595ae183c9202bab6157b11708437517621876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Woman Missed An Accident by Rtc Driver Alertness: ఆర్టీసీ బస్ డ్రైవర్ అప్రమత్తతతో ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) పరిధి లోతుకుంట వద్ద మంగళవారం కిక్కిరిసిన ఓ ఆర్టీసీ బస్సులో మహిళలు ఒక్కసారిగా ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫుట్ బోర్డ్ వద్ద నిలబడిన ఓ మహిళ బస్సు కదులుతుండగా అదుపు తప్పి కింద పడిపోయింది. దీన్ని గమనించిన కింద ఉన్న వారు, చుట్టూ ఉన్న ప్రయాణికులు కేకలు వేయగా.. డ్రైవర్ అప్రమత్తతతో బస్ బ్రేక్ వేశాడు. దీంతో మహిళకు పెను ప్రమాదం తప్పింది. ఫుట్ బోర్డ్ వద్ద ప్రమాదకరంగా ప్రయాణించొద్దని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు, మేడారం జాతర సందర్భంగా 6 వేలకు పైగా ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ కేటాయించడంతో నగరంలో సర్వీసుల కొరత ఏర్పడింది. అయితే, ఈ 4 రోజులూ ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ బస్సుల్లో తీవ్ర రద్దీ నెలకొంటుండగా.. ఇప్పుడు ఎక్కువ బస్సులు జాతరకు కేటాయించడంతో రద్దీ మరింత ఎక్కువైంది.
Also Read: Malpractice: అంతర్జాతీయ వర్శిటీ ప్రవేశ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ - ఏడుగురు అరెస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)