అన్వేషించండి

Youtube Update: రెండు వారాల్లోనే యూట్యూబ్ మరో కీలక నిర్ణయం.. మ్యూజిక్ లవర్స్‌కు మళ్లీ నిరాశేనా.. అసలేం జరుగుతోంది! 

ఇటీవల మ్యూజిక్ విషయంలో పాపులర్ బాట్, గ్రూవీని యూట్యూబ్ తొలగించింది. సెర్చింజన్ గూగుల్ కంపెనీకి చెందిన సంస్థ యూట్యూబ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సెర్చింజన్ గూగుల్ కంపెనీకి చెందిన సంస్థ యూట్యూబ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మ్యూజిక్ విషయంలో పాపులర్ బాట్, గ్రూవీని యూట్యూబ్ తొలగించింది. తాజాగా మరో బాట్, రిథమ్‌ను సైతం తొలగించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి మ్యూజిక్ ప్రేమికులు యూట్యూబ్‌లో తమకు గతంలో మాదిరిగా ఎంజాయ్ చేయలేరు. ఛాటింగ్ మరియు స్ట్రీమింగ్ యాప్ డిస్కార్డ్ లో ఆన్ లైన్ గేమర్లు ఒకచోటకు వస్తారు. కానీ ఇకంనుంచి ఇందులో మ్యూజిక్ తగ్గుతుంది. అందుకు యూట్యూబ్ తాజాగా తీసుకున్న నిర్ణయమే కారణం.

మ్యూజిక్ బాట్ రిథమ్ అనేది థర్డ్ పార్టీకి చెందిన ప్లగిన్. దీనిద్వారా యూజర్లు యూట్యూబ్ లో మ్యూజిక్‌ను ఆస్వాదించేవారు. కానీ రిథమ్ సేవల్ని నిలిపివేయాలని యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ నుంచి చట్టపరంగా డిమాండ్లు రావడంతో ఇటీవల గ్రూవీ సేవల్ని నిలిపివేయగా, తాజాగా రిథమ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఆగస్టు 30 నుంచి గ్రూవీ సేవలు కోల్పోయిన మ్యూజిక్ లవర్స్.. సెప్టెంబర్ 15 నుంచి రిథమ్ సేవల్ని కోల్పోనున్నారు. 20 మిలియన్ల మంది రిథమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగా.. డిస్కార్డ్ సర్వర్ల ద్వారా మొత్తం 560 మిలియన్ల మంది యూజర్లు ఈ మ్యూజిక్ సేవల్ని వినియోగించుకుంటున్నారు.

Also Read: జియో యూజ‌ర్ల‌కు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చ‌వ‌కైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!

దీనిపై రిథమ్ క్రియేటర్ యోవో వెర్జ్ మీడియాతో మాట్లాడారు. ఇలాంటివి సాధారణంగానే జరుగుతుంటాయి. కనుక గత ఏడాది నుంచి మేం ఇతర మార్గాలు సైతం అన్వేషిస్తున్నాం. అయితే గ్రూవీ మ్యూజిక్ బాట్ సేవలు నిలిపివేసిన తక్కువ వ్యవధిలో ఈ నిర్ణయం వస్తుందని ఊహించలేదన్నారు. మ్యూజిక్ రంగంలోనూ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందో యూట్యూబ్ నిర్ణయంతో అర్థమైందన్నారు. ప్రతినెలా 30 మిలియన్ల డిస్కార్డ్ యూజర్లకు రిథమ్ సేవలు అందిస్తోంది. డిస్కార్డ్‌కు ఏకంగా ప్రతినెలా 150 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండగా.. మరో రెండు రోజుల తరువాత మ్యూజిక్ లవర్స్ యూట్యూబ్ నుంచి తమ మ్యూజిక్ సేవల్ని కోల్పోనున్నారని స్పష్టం చేశారు.

Also Read: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ రేపే.. ఐఫోన్ల‌తో పాటు లాంచ్ అయ్యేవి ఇవే! 

యూట్యూబ్ తాజా నిర్ణయాలు గమనిస్తే థర్డ్ పార్టీ సేవలకు స్వస్తి పలికి సొంతంగానే పూర్తి స్థాయిలో మ్యూజిక్ సహా వీడియో సేవల్ని అందించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇతర కంపెనీ సర్వర్లకు బదులుగా సొంతంగా సర్వర్లు రూపొందించి వాటి ద్వారా ఎలాంటి ఆంక్షలు లేకుండా సంగీతాభిమానులకు సేవలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Konda Sushmitha: మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Konda Sushmitha: మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
Bigg Boss 10: 'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్
'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్
Hyderabad Tragedy: రాంనగర్‌లో గణేష్ ఆగమన్ లో తొక్కిసలాట ! బద్రీనాథ్ అనే యువకుడి మృతితో విషాదం
రాంనగర్‌లో గణేష్ ఆగమన్ లో తొక్కిసలాట ! బద్రీనాథ్ అనే యువకుడి మృతితో విషాదం
పెట్రోల్, ఇథనాల్ రెండింటితో నడవనున్న Kia Syros Flex Fuel Car.. త్వరలోనే భారత్‌లో లాంచ్
పెట్రోల్, ఇథనాల్ రెండింటితో నడవనున్న Kia Syros Flex Fuel Car.. త్వరలోనే భారత్‌లో లాంచ్
Madanapalle Lady Don: మదనపల్లె లేడీడాన్ ఇంట్లో తనిఖీలు.. భారీగా ఆస్తి పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు స్వాధీనం!
మదనపల్లె లేడీడాన్ ఇంట్లో తనిఖీలు.. భారీగా ఆస్తి పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు స్వాధీనం!
Embed widget