Wireless Vs Wired Mouse: వైర్డ్ లేదా వైర్‌లెస్ మౌస్ - రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి?
వైర్డ్ మౌస్, వైర్‌లెస్ మౌస్... రెండిట్లో ఏది కొనాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ కథనం మీకోసమే!
Wireless Vs Wired Mouse: మౌస్‌ను కొనుగోలు చేసేటప్పుడు వైర్‌లెస్ లేదా వైర్డ్ ఏ మౌస్ కొనుగోలు చేయాలి అనే ప్రశ్న మన మనస్సులో తలెత్తుతుంది. ప్రస్తుతం చాలా మంది ప్రజలు వైర్‌లెస్ మౌస్‌ని తీసుకుంటారు. ఎందుకంటే దీన్ని క్యారీ చేయడం చాలా సులభం.
ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లలో ఇన్‌బిల్ట్ మౌస్ ప్యాడ్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఎక్స్‌టర్నల్ మౌస్‌ను ఉపయోగించడాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. వైర్డ్, వైర్‌లెస్... రెండు రకాల మౌస్‌లకు వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి.
కొంచెం స్లోగా వైర్‌లెస్ మౌస్
వైర్‌లెస్ మౌస్, వైర్డ్ మౌస్ కంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఈ విషయం గేమింగ్ చేసే వారికే ఎక్కువగా అర్థమవుతుంది. వాస్తవానికి వైర్‌లెస్ మౌస్ రియాక్షన్ టైం వైర్డు మౌస్ కంటే నెమ్మదిగా ఉంటుంది. ఇది గేమింగ్‌లో సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది గేమర్స్ వైర్డ్ మౌస్‌తో గేమింగ్‌ని ఇష్టపడతారు. మీరు కూడా గేమర్ అయితే వైర్డ్ మౌస్ మీకు మంచి ఎంపిక.
వైర్‌లెస్ మౌస్ ప్లస్ పాయింట్ ఇదే
వైర్‌లెస్ మౌస్‌తో మీరు ఎక్కడి నుండైనా పని చేయవచ్చు. అంటే వైర్ లెస్ మౌస్ రేంజ్‌లో మీరు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను ఎక్కడి నుండైనా ఆపరేట్ చేయవచ్చు. అయితే ఇది వైర్డ్ మౌస్ విషయంలో ఇది సాధ్యం కాదు. వైర్డ్ మౌస్‌తో అయితే మీరు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌తో కూర్చోవాలి. కొన్నిసార్లు ఇది చికాకుగా అనిపిస్తుంది. అదేవిధంగా వైర్‌లెస్ మౌస్‌ను ఆపరేట్ చేయడానికి బ్యాటరీ అవసరం. వైర్డ్ మౌస్‌కు ఇది అవసరం లేదు.
ఏది బెస్ట్?
ముందుగా మీకు ఏది ఉత్తమమో చూడండి. అది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. మీరు చాలా గేమింగ్ లేదా ఎడిటింగ్ చేస్తుంటే వైర్డ్ మౌస్ మీకు మంచి ఆప్షన్. అయితే వైర్‌లెస్ మౌస్ జనరల్ యూజ్‌కు కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది. వైర్‌లెస్ మౌస్ ధర ఎక్కువగా ఉంది. మంచి కంపెనీ కావాలనుకుంటే అది మరింత ఎక్కువగా ఉంటుంది.
ఐటెల్ ఎస్23 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఐటెల్ ఎస్23 పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ర్యామ్‌ను స్టోరేజ్ నుంచి వర్చువల్‌గా మరో 8 జీబీ పెంచుకోవచ్చు. అంటే 16 జీబీ ర్యామ్ అందించనున్నారన్న మాట. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు.
ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,799గా నిర్ణయించారు. ఇందులో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కానీ ఈ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. మిస్టరీ వైట్, స్టారీ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జూన్ 14వ తేదీ నుంచి అమెజాన్‌లో ఐటెల్ ఎస్23ని విక్రయించనున్నారు.
Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?