వాటిని వేర్వేరు కంపెనీలు, డేటా, శిక్షణ పద్ధతులతో అభివృద్ధి చేస్తాయి. భాషను అర్థం చేసుకోవడం, సమాధానాలు ఇవ్వడం కోసం ఒక్కో మోడల్ ఒక్కో విధంగా సందర్భాన్ని అర్థం చేసుకుంటుంది.
AI Chatbots: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
AI Chatbots: ఒకే ప్రశ్నకు ChatGPT, Google Gemini, Claude ఏఐ చాట్‌బాట్‌లు వేర్వేరు సమాధానాలు ఇస్తుంటాయి. దీని వెనుక ఉన్న సాంకేతికను తెలుసుకుందాం.

- AI చాట్‌బాట్‌లు వేర్వేరు కంపెనీల శిక్షణ, డేటాపై ఆధారపడతాయి.
- వాటి అంతర్గత ఆర్కిటెక్చర్, పారామీటర్లలోని భేదాలు అవుట్‌పుట్ మారుస్తాయి.
- తాజా సమాచారం, ఇంటర్నెట్ ఆధారపడటం సమాధానాలలో వ్యత్యాసానికి కారణం.
- అంతర్గత సెట్టింగ్‌లు, యాదృచ్ఛికత కూడా సమాధానాలలో చిన్న తేడాలు సృష్టిస్తాయి.
AI Chatbots: ఈ రోజుల్లో ఆఫీస్ పని, కంటెంట్ క్రియేషన్, ఏదైనా సమాచారం.. ఇలా దేనికైనా ఏఐ (AI) చాట్‌బాట్‌ల వాడకం ఎక్కువ అవుతుంది. అయితే, ChatGPT, Google Gemini, Claude వంటి AI చాట్‌బాట్‌లను ఒకే ప్రశ్న అడిగినప్పుడు వేర్వేరు సమాధానాలు వస్తుంటాయి. ప్రశ్న ఒకటే అయినప్పటికీ ఆన్సర్స్ ఎందుకు భిన్నంగా ఉంటున్నాయి? దీని వెనుక అనేక సాంకేతిక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
వివిధ కంపెనీలు- వేర్వేరు ట్రైనింగ్ ప్రక్రియలు
ChatGPT, Gemini, Claude అనేవి వేర్వేరు కంపెనీలు అభివృద్ధి చేసిన AI మోడల్స్. వాటిని వేర్వేరు డేటా, పద్ధతులు, ట్రైనింగ్ ఉపయోగించి అభివృద్ధి చేశారు. భాషను అర్థం చేసుకోవడానికి సమాధానాలు ఇవ్వడానికి ఒక మోడల్ తీసుకునే డేటా టైపు, ఫైన్-ట్యూనింగ్ దాని సమాధానంపై ఆధారపడి ఉంటుంది. అంటే, ఒకే ప్రశ్నను అర్థం చేసుకున్నప్పటికీ, వేర్వేరు మోడల్స్ దాని సందర్భాన్ని విభిన్నంగా అర్థం చేసుకుంటాయి. అందుకే ఒక మోడల్ ఇచ్చే సమాధానం, మరొకటి ఇవ్వకపోవచ్చు.
భిన్నమైన ఆర్కిటెక్చర్
AI చాట్‌బాట్‌లు మనిషిలాగా ప్రశ్నను చదివి, సిద్ధంగా ఉన్న సమాధానం కోసం ఇంటర్నెట్‌లో వెతకవు. ఇవి మీ ప్రశ్న ఆధారంగా నెక్ట్స్ వర్డ్ లేదా వాక్యాన్ని అంచనా వేస్తూ ఆన్సర్స్ ఇస్తుంటాయి. వేర్వేరు మోడళ్లకు వేర్వేరు ఆర్కిటెక్చర్‌లు, పారామీటర్‌లు ఉంటాయి. అందువల్ల, ఒకే ఇన్‌పుట్ ఇచ్చినప్పటికీ వాటి అవుట్‌పుట్‌లు ఎప్పుడూ ఒకేలా ఉండవు.
Also Read: వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
ఇంటర్నెట్, తాజా సమాచారం
మీ ప్రశ్న ఇటీవలి సంఘటనలు, కొత్త టెక్నాలజీ, స్టాక్ మార్కెట్, తాజా వార్తలకు సంబంధించినదైతే, సమాచారాన్ని సేకరించే AI కెపాసిటీని బట్టి ఆన్సర్ మారుస్తుంది. కొన్ని AI వ్యవస్థలు అవసరమైనప్పుడు వెబ్ నుంచి నేరుగా తాజా సమాచారాన్ని తీసుకుంటాయి. మరికొన్ని తమ సొంత టెక్నాలజీపై ఆధారపడవచ్చు. దీనివల్ల వేర్వేరు సమాధానాలు, ఉదాహరణలు కనిపించవచ్చు.
Also Read: ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
ఇంటర్నల్ సెట్టింగ్‌లు
AI మోడల్ ఇంటర్నల్ సెట్టింగ్‌లు కూడా మారుస్తాయి. ఉష్ణోగ్రత, యాదృచ్ఛికత వంటి సెట్టింగ్‌ల వల్ల, ఒకే AIని ఒకే ప్రశ్న రెండుసార్లు అడిగినా అది ఇచ్చే సమాధానంలో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
Also Read: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
Frequently Asked Questions
వేర్వేరు AI చాట్‌బాట్‌లు ఒకే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు ఎందుకు ఇస్తాయి?
AI చాట్‌బాట్‌ల సమాధానాలు భిన్నంగా ఉండటానికి శిక్షణ ప్రక్రియ ఎలా దోహదపడుతుంది?
ప్రతి AI మోడల్‌ను వేర్వేరు డేటా, పద్ధతులు, ఫైన్-ట్యూనింగ్‌తో శిక్షణ ఇస్తారు. దీని వల్ల ఒకే ప్రశ్నను అర్థం చేసుకున్నప్పటికీ, అవి సందర్భాన్ని విభిన్నంగా అర్థం చేసుకుని వేర్వేరు సమాధానాలు ఇస్తాయి.
AI చాట్‌బాట్‌లు ఇంటర్నెట్‌లో సమాధానాల కోసం నేరుగా వెతుకుతాయా?
కాదు, అవి మనిషిలాగా ఇంటర్నెట్‌లో నేరుగా వెతకవు. మీ ప్రశ్న ఆధారంగా నెక్ట్స్ వర్డ్ లేదా వాక్యాన్ని అంచనా వేస్తూ సమాధానాలు ఇస్తాయి.
AI చాట్‌బాట్‌ల అంతర్గత సెట్టింగ్‌లు సమాధానాలను ప్రభావితం చేస్తాయా?
అవును, ఉష్ణోగ్రత, యాదృచ్ఛికత వంటి అంతర్గత సెట్టింగ్‌లు సమాధానాలను మారుస్తాయి. ఒకే AIకి ఒకే ప్రశ్న రెండుసార్లు అడిగినా తేడాలు ఉండొచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















