అన్వేషించండి

WhatsApp Features: వాట్సాప్ మరో కొత్త ఫీచర్.. ఇకపై ఏ భాషలో మెస్సేజ్ అయినా సులభంగా అర్థం చేసుకోవచ్చు

WhatsApp Message Translation Feature | మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. మీకు అర్థంకాని భాషలో మెస్సేజ్ చేసినా సులువుగా అర్థం చేసుకునేందుకు మెస్సేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ తెస్తుంది.

WhatsApp Translation Feature | మెస్సేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌లను చదవడం, అర్థం చేసుకోవడం యూజర్లకు సులభం కానుంది. వాస్తవానికి కంపెనీ మెసేజ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ (Message Translation Feature)ను తీసుకువస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న Android, ఐఫోన్ (iPhone) వినియోగదారులు ఈ ఫీచర్ ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ వినియోగదారులు ఛానల్ అప్‌డేట్‌లు, గ్రూప్ సంభాషణలు, వన్-టు-వన్ చాట్‌ (వ్యక్తిగత ఛాటింగ్)లలో వచ్చిన సందేశాలను అనువాదం చేసుకోగలరని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ వినియోగదారుల గోప్యతను పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటుందని, అనువాద ప్రక్రియ మొత్తం వినియోగదారుల డివైజ్‌లోనే ఉంటుందని, కంపెనీ కూడా దీన్ని చూడలేదని WhatsApp పేర్కొంది. 

ఫీచర్‌పై వాట్సాప్ హర్షం

వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్న మెస్సేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ భాషా పరమైన సమస్యలను తొలగించి ప్రజలు మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి, అవతలి వ్యక్తితో సంభాషించడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నామని WhatsApp తాజా ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్ వినియోగించాలనుకునే యూజర్లు మీ ఫోన్లో యాప్‌ను అప్‌డేట్ చేయాలని కోరారు. 

ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?

మెస్సేజ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. ఏదైనా సందేశాన్ని అనువదించడానికి, దానిపై ఎక్కువసేపు ప్రెస్ చేయండి. ఆ తర్వాత, అనువాదం (Translation) ఎంపిక వస్తుంది. ఈ ఎంపికలో వినియోగదారులు తమకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు వారు భాషను డౌన్‌లోడ్ సైతం చేసుకోవాలని సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 3 బిలియన్లకు పైగా వినియోగదారులు మెస్సేజ్‌లు ఇబ్బంది లేకుండా అర్థం చేసుకోవడానికి ఈ ఫీచర్‌ను విడుదల చేయడానికి కంపెనీ చర్యలు తీసుకుంది. 

ఏయే భాషలు సపోర్ట్ చేస్తుంది

ఈ వాట్సాప్ మెస్సేజ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ దశలవారీగా విడుదల చేయనున్నారు. ప్రారంభంలో Android ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను ఇంగ్లీష్, హిందీ, స్పానిష్,పోర్చుగీస్, రష్యన్, అరబిక్ భాషలను సపోర్ట్ చేస్తుంది. తరువాత దశలవారీగా ఇతర భాషలను కూడా ఇందులో చేర్చుతారు. అదే సమయంలో iPhone 19 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఆ భాషలలో వచ్చే మెస్సేజ్‌లను మీకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్‌లేట్ చేసి  ఇస్తుంది. Android ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫీచర్‌ను మెరుగు చేయడానిక అదనపు ఎంపిక ఇవ్వనున్నారు. ఇందులో వినియోగదారులు తమ ఇష్టం ప్రకారం ఏదైనా చాట్‌లో ఆటోమేటిక్ అనువాదాన్ని చేయగలరు. ఆ తర్వాత, ఆ చాట్‌లో వచ్చే అన్ని సందేశాలు అనువాదం అవుతాయి. వాటిని మీరు మాన్యువల్‌గా ట్రాన్స్‌లేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget