అన్వేషించండి

Whatsapp Code Feature: వాట్సాప్ ఛాట్స్‌ను సీక్రెట్ కోడ్‌తో లాక్ - నెక్స్ట్ లెవల్ ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తున్న కంపెనీ!

Whatsapp Privacy Feature: వాట్సాప్ ఛాట్లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసే ఫీచర్‌పై కంపెనీ టెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్‌లో ఉంది.

Whatsapp Chat Hide: వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై పని చేయడం ప్రారంభించింది. దీని ద్వారా మెసేజింగ్ యాప్‌లో సీక్రెట్ ఛాట్లను హైడ్ చేయవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు హైడ్ చేసిన ఛాట్లు సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే కనిపిస్తాయి. ప్రస్తుతం వాట్సాప్‌ యాప్ ఓపెన్ చేసి మెయిన్ స్క్రీన్‌ను స్వైప్ డౌన్ చేస్తే పైన హిడెన్ ఛాట్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు వాట్సాప్ తీసుకుకురానున్న ఫీచర్ ద్వారా సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే వాటిని యాక్సెస్ చేయడం సాధ్యం అవుతుంది. దీంతోపాటు వాట్సాప్ ఛానెల్స్‌కు యూజర్ నేమ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉండనుంది.

వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.24.20 బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీరు మెసేజింగ్ యాప్‌లో సీక్రెట్ కోడ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు లాక్డ్ ఛాట్స్ లిస్ట్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్న మూడు చుక్కల మెనూ ఓపెన్ చేయాలి. అందులో ఛాట్ లాక్ సెట్టింగ్స్‌కు వెళ్లి ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అక్కడ ఒక సీక్రెట్ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాలి. ఆ సీక్రెట్ కోడ్‌ను మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే తర్వాత మీరు ఎప్పుడైనా కోడ్ మర్చిపోయి రీసెట్ చేయాలనుకుంటే లాక్ చేసిన ఛాట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి.

ఒకసారి మీరు లాక్డ్ ఛాట్స్‌ను హైడ్ చేసిన తర్వాత అవి లాక్డ్ ఛాట్స్ కేటగిరిలో కనిపించబోవు. సెర్చ్ బార్‌లో మీరు మీ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వాటిని యాక్సెస్ చేయవచ్చు. కాబట్టి ఈ ఫీచర్ ద్వారా మీ ప్రైవసీ మరింత మెరుగుపడనుంది.

ఒకవేళ మీరు ఇంతకు ముందు తరహాలో ఫింగర్ ప్రింట్ లాకింగ్ మెకానిజం కావాలి అనుకుంటే... హైడ్ లాక్డ్ ఛాట్స్ ఆప్షన్ డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లాక్డ్ ఛాట్లు మళ్లీ మీ మెయిన్ ఛాట్ల లిస్టులో కనిపిస్తాయి. అంటే వాటిని ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ అయితే కచ్చితంగా అవసరం అవుతుంది.

దీంతోపాటు వాట్సాప్ ఛానెల్స్‌కు యూజర్ నేమ్ అందించే ఫీచర్‌ను కూడా కంపెనీ పరీక్షిస్తుంది. ఒక్కసారి యూజర్ నేమ్ సెట్ చేశాక ఛానెల్ సబ్‌స్క్రైబర్లు యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఛానెల్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ ఫీచర్‌పై కంపెనీ ఇంకా పని చేస్తూనే ఉంది. బీటా టెస్టర్లకు కూడా ఈ ఫీచర్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ప్రపంచంలో వాట్సాప్ నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. మనదేశంలో కూడా వాట్సాప్‌కు 50 కోట్ల వరకు యూజర్లు ఉన్నారు.

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

టాప్ హెడ్ లైన్స్

BRS MLCs Bail Cancellation: BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
Vijay Vs Stalin: తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ సైగ’ మంటలు.. సీఎం విజయ్ వర్సెస్ ఎంకే స్టాలిన్!
తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ సైగ’ మంటలు.. సీఎం విజయ్ వర్సెస్ ఎంకే స్టాలిన్!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLCs Bail Cancellation: BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
Vijay Vs Stalin: తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ సైగ’ మంటలు.. సీఎం విజయ్ వర్సెస్ ఎంకే స్టాలిన్!
తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ సైగ’ మంటలు.. సీఎం విజయ్ వర్సెస్ ఎంకే స్టాలిన్!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
Trump Dividend: డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
Botsa Satyanarayana Cry: చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
Future City Land Allegations: అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
Embed widget