By: ABP Desam | Updated at : 31 Mar 2023 02:09 PM (IST)
వాట్సాప్ డిస్అప్పీయరింగ్ మెసేజుల కోసం 15 టైమ్ ఆప్షన్లు (image source-pixabay)
WhatsApp: సమాచార మార్పిడికి అందరూ వినియోగించే బెస్ట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు వాట్సాప్ వినియోగిస్తున్నారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ వినియోగదారుల అవసరాలను ఇప్పటికప్పుడు గుర్తిస్తూ కొత్త అప్ డేట్లను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే వాట్సాప్ నుంచి కొత్తగా మరిన్ని ఫీచర్లు రానున్నాయి. ఇప్పటికే చాలా ఫీచర్స్‌ను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు మెసేజ్ డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్‌లను తీసుకురావాలని భావిస్తోంది.
ఇప్పటికే ఎడిట్ మెసేజ్, ఆడియో చాట్స్, వ్యూ వన్స్ ఆడియో వంటి ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ పరీక్షిస్తోంది. ఇందులో తాజాగా మరో ఫీచర్‌ను అప్‌డేట్ చేయనుంది. 2020లో పరిచయం చేసిన డిస్‌అప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోన్న వాట్సాప్.. మరోసారి ఈ ఫీచర్‌లో అదనపు మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో ప్రస్తుతం ఉన్న టైమ్ ఆప్షన్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అదనపు ఆప్షన్లతో యూజర్లు వాట్సాప్ ద్వారా జరిపితే ముఖ్యమైన సంభాషణలు త్వరగా డిలీట్ అయిపోవడంతోపాటు, వాటిని ఇతరులు చూడలేరని వాట్సాప్ భావిస్తోంది.
మెసేజ్ డిస్‌అప్పియరింగ్ ఫీచర్ ద్వారా మెసేజ్‌లు టైం పీరియడ్ ముగియగానే ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతాయి. ఈ టైం పీరియడ్ ప్రస్తుతం 24 గంటలు, 7 రోజులు, 90 రోజులుగా ఉంది. అయితే ఈ ఫీచర్లో అదనంగా మరో 15 ఆప్షన్లను వినియోగదారులకు అందించాలని వాట్సాప్ భావిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, రాబోయే కొత్త ఫీచర్లో ఆటోమెటిక్ మెసేజ్ డిలీట్ టైం పరిమితిని ఒక గంట నుంచి మొదలుకుని ఏడాది వరకు పొడిగించే అవకాశం ఉంది. అంటే యూజర్ డిస్‌అప్పియరింగ్ ఆప్షన్‌ను ఆన్ చేసి మూడు టైమ్ లిమిట్‌లలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఏడు రోజుల టైమ్ ఆప్షన్‌ను ఎంచుకుని మెసేజ్ పంపితే.. అవతలి వ్యక్తి ఆ మెసేజ్ చూసిన ఏడు రోజుల తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. డిస్‌అప్పియరింగ్ మెసేజెస్ ఆన్ చేసిన తర్వాత అందులో మోర్ ఆప్షన్‌లో కొత్తగా పరిచయం చేయనున్న టైమ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ అప్‌డేట్ వల్ల వినియోగదారులు తాము పంపే, స్వీకరించే మెసేజ్‌లపై ఎక్కువ కంట్రోల్‌ను పొందుతారు. వాట్సాప్ వినియోగదారుడు తనకు వచ్చే, తాను పంపే మెసేజ్ ఎప్పట్లోగా డిస్‌అప్పియర్ కావాలో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. మనం సెట్ చేసే టైం తర్వాత మెసేజ్‌లు డిస్అప్పియర్ అవుతాయి. ఈమేరకు వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) ఒక రిపోర్ట్‌ను పబ్లిష్ చేసింది. దీనివల్ల వాట్సాప్ యూజర్ల సంభాషణల గోప్యత పెరుగుతుందని భావిస్తున్నారు.
WhatsApp is working on 15 additional durations for disappearing messages!
WhatsApp plans to bring an update for disappearing messages that include 15 new durations.
This feature is under development and it will be released in a future update of the app.https://t.co/ESEq4SyTgk— WABetaInfo (@WABetaInfo) March 29, 2023
వాట్సాప్‌లో 15 కొత్త టైమింగ్స్ ఇవే
ఒక సంవత్సరం, 180 రోజులు, 60 రోజులు, 30 రోజులు, 21 రోజులు, 14 రోజులు, 6 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 12 గంటలు, 6 గంటలు, 3 గంటలు మరియు 1 గంట. గంట వ్యవధి అనేది ముఖ్యంగా సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న మెసేజ్‌లకు ఉపయోగకరంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ టైమింగ్ తో పంపే మెసేజ్.. 1 గంట తర్వాత మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఫోన్ లో ఉండదు.
ఆడియో చాట్ ఫీచర్
టెక్స్ట్ చాట్ మాదిరిగా ఆడియో చాట్ ఫీచర్‌ను కూడా పరిచయం చేసేందుకు వాట్సాప్ ఏర్పాట్లు చేస్తోంది. వాట్సాప్‌లో ఇప్పటికే వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. వాయిస్ నోట్ సెండ్ చేసే ఫీచర్ కూడా ఉంది. అయితే త్వరలో వాయిస్ చాట్ కోసం స్పెషల్ విండోను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.7.12 బీటాలో ఈ ఫీచర్ అందుబాటులో ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. ఈ ఆడియో చాట్ ఆప్షన్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ముందు ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే తీసుకురానున్నారు. టెస్టింగ్ తర్వాత iOSకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని భావిస్తున్నారు. అయితే ఈ అప్‌డేట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వాట్సాప్ బీటా ఇన్‌ఫో వెల్లడించలేదు.
📝 WhatsApp beta for Android 2.23.7.12: what's new?
— WABetaInfo (@WABetaInfo) March 25, 2023
WhatsApp is working on a new feature called audio chats, available in a future update of the app!https://t.co/Gpve2Jhvv9
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?
BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!
Coin On Railway Track: ట్రైన్ ట్రాక్‌పై నాణెం పెడితే రైలు బండి పట్టాలు తప్పుతుందా?
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్