WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ యాప్ ద్వారా వ్యక్తిగత కమ్యూనికేషన్‌తో పాటు, ఆఫీస్ కమ్యూనికేషన్ కూడా జరుగుతోంది. కాబట్టి ఈ యాప్ ఈరోజు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.
వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, WhatsAppకి మెటా అనేక కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఇప్పుడు దీంతోపాటు కంపెనీ మరొక ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. కమ్యూనిటీ గ్రూప్‌లో యాడ్ అయిన వ్యక్తులు మెసేజ్‌కి రియాక్ట్ అయ్యే ఆప్షన్ రానుంది.
ప్రస్తుతానికి ఐవోఎస్ యూజర్లకు మాత్రమే...
WhatsApp ప్రస్తుతానికి iOS వినియోగదారుల కోసం మాత్రమే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. అంటే కమ్యూనిటీ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లకు ఐఓఎస్ యూజర్లు మాత్రమే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ చాట్‌లలో వ్యక్తులు ఒకరి మెసేజ్‌లకు మరొకరు రియాక్ట్ అవ్వగలుగుతున్నారు.
ఇప్పుడు వ్యక్తులు కమ్యూనిటీ గ్రూప్స్‌లో కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై పని జరుగుతోంది. ఇది కొంత సమయం తర్వాత మొదటి బీటా వెర్షన్‌లో లైవ్ అవుతుంది. మొదటిగా సాధారణ iOS వినియోగదారుల కోసం విడుదల కానుంది. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని WABetaInfo తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
WhatsApp కమ్యూనిటీ గ్రూప్ అంటే ఏమిటి?
వాట్సాప్ గ్రూప్స్‌ను మెర్జ్ చేసి కమ్యూనిటీగా క్రియేట్ చేయవచ్చు. లేకపోతే ఒక కమ్యూనిటీని క్రియేట్ చేయవచ్చు. ఒక కమ్యూనిటీలో గరిష్టంగా 50 గ్రూప్‌లను యాడ్ చేయవచ్చు. అదే సమయంలో కమ్యూనిటీలోని మెంబర్స్‌తో కమ్యూనికేషన్ కూడా చేయవచ్చు.
త్వరలో అందుబాటులోకి
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వాట్సాప్ పలు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందించబోతోంది. స్టేటస్‌ని రిపోర్ట్ చేయడానికి లేదా స్టేటస్‌పై వాయిస్ నోట్ పెట్టడానికి, టెక్స్ట్ ఫాంట్‌ని మార్చడానికి లేదా బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడానికి లేదా టెక్స్ట్‌ను ఎలైన్ చేయడానికి ఆప్షన్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ వినియోగదారులకు ఇంకా అనేక రకాల ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా యాప్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత సరదాగా ఉంటుంది.
వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. అదే కాల్స్‌కు కూడా నోటిఫికేషన్స్‌ను డిజేబుల్ చేయడం. కాల్ నోటిఫికేషన్లను మ్యూట్ చేసేందుకు ఇది వినియోగదారులను కూడా అనుమతించనుంది. తద్వారా ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కాల్ నోటిఫికేషన్స్‌తో డిస్టర్బ్ అవ్వకుండా ఉండవచ్చు.
కొన్ని సార్లు వాట్సాప్ డీఎన్‌డీ ఫీచర్ కూడా టెక్నికల్ గ్లిచెస్ కారణంగా ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు ఈ 'Disable Notifications for Calls' ఫీచర్ ఉపయోగపడనుంది. WaBetaInfo కథనం ప్రకారం విండోస్ 2.2250.4.0 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ మొదటిసారి కనిపించింది.
వాట్సాప్ 'Disable Notifications for Calls' ఎలా ఉపయోగించాలి?
1. మొదటగా వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
2. సెట్టింగ్స్‌లోకి ఎంటర్ అవ్వాలి.
3. నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేయాలి.
అక్కడ డిజేబల్ నోటిఫికేసన్స్ ఫీచర్ మీకు అందుబాటులో ఉందో లేదో చూడండి. ఒక వేళ ఉంటే ఆ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బీటా యూజర్లకు అప్‌డేట్ ఇచ్చారు కాబట్టి త్వరలో మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.