అన్వేషించండి

WhatsApp Username Feature: వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ విప్లవం - ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్‌నేమ్స్ ఫీచర్.. ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి!

How To Reserve WhatsApp Username: వాట్సాప్‌లో విప్లవాత్మక ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది. ఫోన్ నంబర్ లేకపోయినా చాట్ చేయొచ్చు.. ఇందు కోసం యూజర్‌నేమ్’ రిజర్వేషన్ ను ప్రారంభించింది.

WhatsApp Username Key Security: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన యూజర్ల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన, బిగ్గెస్ట్ ప్రైవసీ ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు వాట్సాప్‌లో ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలన్నా, చాట్ చేయాలన్నా ఖచ్చితంగా ఫోన్ నంబర్ షేర్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇకపై ఆ అవసరం లేకుండా కేవలం యూజర్‌నేమ్ తోనే ఇతరులతో చాట్ చేసే సరికొత్త సదుపాయాన్ని మెటా  సంస్థ తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కోట్లకు పైగా వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

ముందే రిజర్వ్ చేసుకోండి.. నచ్చిన పేరు దక్కించుకోండి! 

ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరుతో చాలా మంది యూజర్లు ఉంటారు కాబట్టి, నచ్చిన యూజర్‌నేమ్ ఇతరుల పరం కాకముందే సొంతం చేసుకునేందుకు వాట్సాప్ ఈ వారం నుంచే గ్లోబల్ యూజర్‌నేమ్ రిజర్వేషన్  ప్రక్రియను ప్రారంభించింది. ఈ సంవత్సరం చివర్లో ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో లైవ్ చేయబోతున్నారు. అయితే, ముందే తమకు నచ్చిన ఐడెంటిటీని లాక్ చేసుకోవాలనుకునే వారి కోసం ఈ ముందస్తు రిజర్వేషన్ ఆప్షన్ కల్పించారు. ఒకవేళ మీకు నచ్చిన పేరు దొరకకపోతే.. యాప్‌లోనే ఉండే ప్రత్యేక  యూజర్‌నేమ్ జనరేటర్ ద్వారా ప్రత్యామ్నాయ పేర్లను వాట్సాప్ సూచిస్తుంది.
  
 సోషల్ మీడియా హ్యాండిల్ కాదు.. కేవలం ప్రైవసీ టూల్ మాత్రమే! 

ఈ ఫీచర్ చూడటానికి ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్  తరహాలో కనిపించినప్పటికీ.. ఇది సోషల్ మీడియా నెట్‌వర్క్ కాదని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్‌లో ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ లేదా సెర్చ్ సజషన్స్ ఉండవు. అంటే, ఒక వ్యక్తి ఖచ్చితమైన యూజర్‌నేమ్ టైప్ చేస్తేనే వారి ప్రొఫైల్ కనిపిస్తుంది తప్ప, ఎవరైనా పడితే వాళ్లు సెర్చ్ చేసి వేధించడానికి వీలుండదు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ గ్రూపులు, స్కూల్ పేరెంట్స్ కమ్యూనిటీలు, ఆఫీస్ ప్రాజెక్ట్‌లు లేదా తెలియని వ్యక్తులతో గ్రూప్ చాట్లలో జాయిన్ అయినప్పుడు మీ ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించకుండా దాచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.
 
 మరో అదనపు రక్షణ.. ‘యూజర్‌నేమ్ కీ’  

ప్రైవసీని మరింత కఠినతరం చేస్తూ వాట్సాప్ ఇందులో మరో సరికొత్త సెక్యూరిటీ లేయర్‌ను ప్రవేశపెట్టింది. అదే ‘యూజర్‌నేమ్ కీ’  . ఒకవేళ మీ యూజర్‌నేమ్ ఎవరికైనా తెలిసినా సరే, వారు మీకు మొదటిసారి మెసేజ్ చేయాలంటే మీరు సెట్ చేసుకున్న 4 అంకెల సీక్రెట్ కీ  ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కీ లేకుండా ఎవరైనా మెసేజ్ పంపితే.. ఆ మెసేజ్ నేరుగా మీ మెయిన్ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా ‘రిక్వెస్ట్ ఫోల్డర్’ లోకి వెళ్తుంది. దీనివల్ల గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే స్పామ్ మెసేజ్‌లకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు.

 యూజర్‌నేమ్‌ను ఎలా సెట్/రిజర్వ్ చేసుకోవాలి? 

ఈ ఫీచర్ ప్రస్తుతం దశలవారీగా రోల్ అవుట్ అవుతోంది. మీ అకౌంట్‌కు ఈ ఆప్షన్ అందుబాటులోకి రాగానే వాట్సాప్ లోపల ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది.

 స్టెప్ 1:  మొదట మీ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
 స్టెప్ 2: వాట్సాప్ ఓపెన్ చేసి  Settings  లోకి వెళ్లండి.
 స్టెప్ 3:  అక్కడ  Account పై క్లిక్ చేసి, ఆపై  Username  ఆప్షన్‌ను ఎంచుకోండి. (కొన్ని డివైజ్‌లలో ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేసినా ఈ ఆప్షన్ కనిపిస్తుంది).
 స్టెప్ 4: మీకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను (3 నుండి 35 అక్షరాల లోపు) టైప్ చేసి Save బటన్ నొక్కి రిజర్వ్ చేసుకోండి.

మరో విశేషం ఏమిటంటే.. మీరు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో వాడుతున్న సేమ్ యూజర్‌నేమ్‌ను మెటా అకౌంట్స్ సెంటర్   ద్వారా లింక్ చేసి, ఇక్కడ కూడా అదే హ్యాండిల్‌ను సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.  

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget