అన్వేషించండి

Vivo X100 Series: 100x జూమ్‌ చేయగల కెమెరాలతో వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ - కంపెనీ బెస్ట్ సిరీస్ ఇవే!

Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన లేటెస్ట్ ఎక్స్100 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వివో లాంచ్ చేసే ఫోన్లలో బెస్ట్ సిరీస్ ఇదే.

Vivo X100 Pro: వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లూ 100x జూమ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పని చేయనున్నాయి.

వివో ఎక్స్100 ధర (Vivo X100 Price)
ఇందులో ఐదు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా (సుమారు రూ.45,600) నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 4,299 యువాన్లుగానూ (సుమారు రూ.49,100), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,599 యువాన్లుగానూ (సుమారు రూ.52,500) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే 4,999 యువాన్లు (సుమారు రూ.57,100) చెల్లించాల్సిందే. ఇందులో 16 జీబీ ర్యామ్ (ఎల్పీడీఆర్5టీ అడ్వాన్స్‌డ్ రామ్) + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. ఈ తరహా అడ్వాన్స్‌డ్ ర్యామ్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. దీని ధరను 5,099 యువాన్లుగా (సుమారు రూ.58,200) నిర్ణయించారు.

వివో ఎక్స్100 ప్రో ధర (Vivo X100 Pro Price)
ఇందులో ఐదు వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగా (సుమారు రూ.57,100) ఉంది. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 5,299 యువాన్లుగానూ (సుమారు రూ.60,500), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,499 యువాన్లుగానూ (సుమారు రూ.63,800) నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే మాత్రం 5,999 యువాన్లు (సుమారు రూ.69,600) ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ రెండు ఫోన్లూ బ్లాక్, ఆరెంజ్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో మార్కెట్లో లాంచ్ అయ్యాయి. లుక్స్ పరంగా రెండు ఫోన్లలోనూ ఎక్కువగా తేడాలు లేవు. వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు. ఒకవేళ లాంచ్ అయితే ఐకూ 12 సిరీస్, షావోమీ 13 సిరీస్, వన్‌ప్లస్ 11 సిరీస్ ఫోన్లతో పోటీ పడనున్నాయి.

వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo X100 Series Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పని చేయనున్నాయి. రెండు ఫోన్లలోనూ 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ రిజల్యూషన్ 2800 x 1260 పిక్సెల్స్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌పై వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో రన్ కానున్నాయి.

ఇక కెమెరాల విషయంలో మాత్రం రెండు ఫోన్లలోనూ పలు మార్పులు ఉన్నాయి. వివో ఎక్స్100లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. వివో ఎక్స్100 ప్రోలో ఒక అంగుళం సైజున్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 4.3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. ఈ రెండు ఫోన్లూ 100x జూమ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. 8కే వీడియో రికార్డింగ్ కూడా వీటి ద్వారా చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్లలోనూ ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

వివో ఎక్స్100లో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక వివో ఎక్స్100 ప్రోలో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ జెన్ 3.2 పోర్టు, వైఫై 7, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

టాప్ హెడ్ లైన్స్

SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 

వీడియోలు

JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget