అన్వేషించండి

Vivo V40e: మోస్ట్ అవైటెడ్ వివో వీ40ఈ వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్ ఇదేనా?

Vivo New Phone: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ వీ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే వివో వీ40ఈ. ఈ ఫోన్ ధర రూ.28,999 నుంచి ప్రారంభం కానుంది.

Vivo V40e Launched: వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ (Vivo V40e) మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. 4కే వీడియో రికార్డింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇన్ డిస్‌‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, రెండు కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

వివో వీ40ఈ ధర (Vivo V40e Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మనదేశంలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999గా ఉంది. మింట్ గ్రీన్, రాయల్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. వివో ఇండియా ఈ-స్టోర్, మెయిన్‌లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. 

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

వివో వీ40ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo V40e Specifications)
వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది. వెట్ టచ్ ఫీచర్ ద్వారా తడి చేతులతో కూడా ఫోన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌పై వివో వీ40ఈ పని చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు డ్యూయల్ కెమరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్‌ను అందించారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. ముందు, వెనక కెమెరాలు రెండూ 4కే వీడియ రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. ఐపీ64 రేటింగ్ ఉన్న డస్ట్, స్ప్లాష్ రెస్టిసెన్స్ ఫీచర్లు కూడా అందించారు. డ్యూయల్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, ఓటీజీ, జీపీఎస్, బ్లూటూత్ వీ5.4, యూఎస్‌బీ టైప్-సీపోర్టు ఫీచర్లు కూడా ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీని మందం 0.74 సెంటీమీటర్లు కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget