Hisense TV: 4కే డిస్‌ప్లేతో హైసెన్స్ కొత్త టీవీలు - ఏకంగా 102W సౌండ్ అవుట్‌పుట్
హైసెన్స్ కొత్త స్మార్ట్ టీవీ మనదేశంలో లాంచ్ అయింది.
హైసెన్స్ ఏ7హెచ్ టొర్నాడో 2.0 టీవీ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 55 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. సౌండ్, డిస్‌ప్లే రెండూ ఈ టీవీలో అద్భుతంగా ఉండనున్నాయి. 4కే సపోర్ట్ ఉన్న డిస్‌ప్లే ఇందులో ఉండగా, జేబీఎల్ ట్యూన్డ్ స్పీకర్లు అందించారు. ఏకంగా 102W సౌండ్ అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది.
హైసెన్స్ ఏ7హెచ్ టొర్నాడో 2.0 టీవీ ధర
ఈ టీవీ ధరను రూ.42,990గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. 55 అంగుళాల టీవీల్లో బెస్ట్ ఆప్షన్లలో ఒకటిగా ఇది ఉండనుంది.
హైసెన్స్ ఏ7హెచ్ టొర్నాడో 2.0 టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
హైసెన్స్ ఏ7హెచ్ టొర్నాడో 2.0 టీవీలో 55 అంగుళాల 4కే ఎల్ఈడీ ప్యానెల్‌ను అందించారు. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉంది. ఆటో లో లేటెన్సీ మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఈ టీవీలో ఉండనున్నాయి. ఇది గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ రెస్పాన్స్ టైంను 8 మిల్లీ సెకన్లకు తగ్గించనుంది. డాల్బీ విజన్ ఫీచర్ ద్వారా పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ కానుంది.
జేబీఎల్ ట్యూన్ చేసిన ఆరు స్పీకర్ల సిస్టం ఇందులో ఉంది. ఇది 102W సౌండ్ అవుట్‌పుట్‌ను డెలివర్ చేయనుంది. డాల్బీ అట్మాస్ ఆబ్జెక్ట్ బేస్ట్ ఆడియో టెక్నాలజీ ఫీచర్ కూడా అందించారు. ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పని చేసే గూగుల్ టీవీ ఇంటర్ ఫేస్ ఉంది.
బిల్ట్ ఇన్ క్రోమ్ సపోర్ట్, యాపిల్ ఎయిర్ ప్లే, యాపిల్ హోం కిట్‌లకు బిల్ట్ ఇన్ సపోర్ట్ ఉంది. ఇందులో ఉన్న రిమోట్ ఫైండర్ ఫీచర్ ద్వారా రిమోట్‌ను ట్రాక్ చేయవచ్చు. హెచ్‌డీఎంఐ, 3.5 ఎంఎం పోర్టు, బ్లూటూత్ వీ5.0, రెండు యూఎస్‌బీ పోర్టులు, వైఫై కంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram