అన్వేషించండి

Spam Calls: స్పామ్ కాల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? జస్ట్ ఇలా చేస్తే మళ్లీ రావు!

చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నిత్యం ఇబ్బంది కలిగిస్తుంటాయి స్పామ్ కాల్స్. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని రాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత స్పామ్ కాల్స్ విపరీతంగా వేధిస్తున్నాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చే స్పామ్ కాల్స్ ఇప్పుడు వస్తున్నాయి. ముఖ్యమైన పని ఉన్న సందర్భాల్లో ఈ స్పామ్ కాల్స్ రావడం మూలంగా చిరాకు, కోపం వస్తుంది. వీటిలో కొన్ని ప్రచారం కోసం వచ్చే కాల్స్ కాగా,  మరికొన్ని మోసపూరిత కాల్స్ ఉంటాయి. ఈ ఏడాది అమెరికాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సుమారు 52 బిలియన్లకు పైగా రోబోకాల్స్ అందుకున్నట్లు యూమెయిల్ అనే సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి వారం సుమారు 1 బిలియన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించింది.

వాస్తవానికి మనకు వచ్చే కాల్స్ లో ఎక్కువగా రోబో కాల్స్ ఉంటాయి. ఈ కాల్స్ ముందుగా రికార్డు చేయబడి ఉంటాయి. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్ గా రికార్డు అయిన వాయిస్ ను వినిపిస్తుంది. టెలి మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా వస్తుంటాయి. ప్రజలకు తమ ప్రొడక్ట్స్ గురించి వివరించి మార్కెట్ చేసుకునేందుకు పలు కంపెనీలు ఈ కాల్స్ చేస్తుంటాయి. అటు మోసపూరిత ఉద్దేశంతో కూడిన స్పామ్ కాల్స్.. యూజర్లకు సంబంధించిన బ్యాంక్ డేటా సహా అత్యంత ముఖ్యమైన వివరాలను దొంగిలించే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి అవాంఛిత కాల్స్ నుంచి రక్షణ పొందేందుకు గూగుల్ రెండు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.  ఈ ఫీచర్లు కాలర్ ID, స్పామ్ ప్రొటెక్షన్ లతో డిఫాల్ట్‌ గా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆన్ అవుతాయి. ఒక వేళ ఆన్ చేయకపోతే వినియోగదారులు స్పామ్ కాల్స్ రాకుండా ఉండేలా ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.      

1: ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయాలి. 

2: ఇప్పుడు 'మోర్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

3: ఆ తర్వాతసెట్టింగ్‌ల బటన్‌ ను ఎంచుకోవాలి.

4: 'స్పామ్,  కాల్ స్క్రీన్'ను సెలెక్ట్ చేసుకోవాలి.

5: కాలర్ & స్పామ్ ID ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసుకోవాలి.    

స్పామ్ కాల్స్ ను ఎలా గుర్తించాలంటే?

వాస్తవానికి గూగుల్ ఆయా కాల్స్ ను పరిశీలించి అవాంఛిత కాల్ గా భావిస్తే రాకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ గూగుల్ నుంచి తప్పించుకుని వస్తే ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫోన్ కాల్ లో దాన్ని బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

1: ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయాలి.

2: యాప్ కింది భాగంలో రీసెంట్ ట్యాబ్‌ను నొక్కాలి.

3: ఇప్పుడు మీరు స్పామ్‌ గా రిపోర్టు చేయాలి అనుకుంటున్న కాల్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి.

4: ఇప్పుడు బ్లాక్ చేయాలి. లేదంటే, స్పామ్ రిపోర్టు కొట్టాలి.

కొన్ని వైర్‌లెస్ క్యారియర్‌లు కూడా కాల్ బ్లాకింగ్ ఫీచర్‌ను అందిస్తాయి.  AT&T ActiveArmor Ios,  Android కోసం అందుబాటులో ఉంది. ఇది స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేస్తుంది. T-Mobile స్కామ్ షీల్డ్ కస్టమర్లను రోబోకాల్స్ నుంచి రక్షించడానికి  బహుళ ఫీచర్లను కలిగి ఉంటుంది.  రోబోకాల్స్  సంఖ్యను పరిమితం చేయడానికి థర్డ్ పార్టీ యాప్ లను కూడా ఉన్నాయి. Hiya అనే యాప్ కూడా స్పామ్ కాల్స్ ను నిరోధిస్తుంది.  Nomorobo కూడా వినియోగదారులకు స్పామ్ కాల్స్ ను రాకుండా చేస్తుంది. ఫైర్‌వాల్ యాప్ ఐఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది అవాంఛిత కాల్‌లను నిరోధించడంలో బాగా పనిచేస్తుంది.

Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - జూమ్, గూగుల్ మీట్ తరహాలో!

Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!

టాప్ హెడ్ లైన్స్

How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget