Samsung Galaxy Z Fold 6 Special Edition: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
Samsung Galaxy Z Fold 6 Special Edition Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఎన్నో ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy Z Fold 6 Special Edition Price: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ముందు వచ్చిన స్టాండర్డ్ గెలాక్సీ ఫోల్డ్ 6 కంటే మరింత సన్నగా, తేలికగా ఉండనుంది. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ స్పెషల్ ఎడిషన్‌లో దీని కెమెరా సిస్టం, డిస్‌ప్లే ఫీచర్లను మరింత మెరుగు పరిచారు. అయితే దీని లాంచ్ అనేది లిమిటెడ్‌గా కేవలం దక్షిణ కొరియాలో మాత్రమే విడుదల చేశారు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ ధర
ఈ స్పెషల్ ఎడిషన్ ధరను దక్షిణ కొరియాలో 27,89,600 వాంగ్‌లుగా (మనదేశ కరెన్సీలో రూ.1.7 లక్షలు) నిర్ణయించారు. ఇది 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. బ్లాక్ షాడో కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ తన న్యూస్ రూమ్ పోస్టులో రివీల్ చేసింది. అక్టోబర్ 25వ తేదీన దీనికి సంబంధించిన సేల్ దక్షిణ కొరియాలో జరగనుంది. దీన్ని కొనుగోలు చేస్తే శాంసంగ్ గెలాక్సీ రింగ్, శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్10 అల్ట్రాలపై ప్రత్యేక డిస్కౌంట్ కూపన్ లభించనుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 నార్మల్ వేరియంట్ కంటే స్పెషల్ ఎడిషన్‌లో కాస్త పెద్ద డిస్‌ప్లేలు ఉండనున్నాయి. ఇందులో 8 అంగుళాల ఇంటర్నల్, 6.5 అంగుళాల ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేలు ఉండనున్నాయి. స్టాండర్డ్ మోడల్లో 7.6 అంగుళాల ఇంటర్నల్, 6.3 అంగుళాల ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేలు అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్‌పై పని చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని మందం 10.6 మిల్లీమీటర్లు కాగా, బరువు 236 గ్రాములుగా ఉంది. 200 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఇందులో అందించడం విశేషం. శాంసంగ్ ఏఐ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
막 찍어도 인생 사진 카메라
— Samsung Korea 삼성전자 (@SamsungKorea) July 10, 2024
Galaxy Z Flip6#GalaxyZFlip6 #갤럭시Z플립6#GalaxyAI #갤럭시AI#SamsungUnpacked #Samsung
삼성 멤버스 스타즈 2025 모집이 시작되었습니다.
— Samsung Korea 삼성전자 (@SamsungKorea) October 8, 2024
갤럭시 팬이라면 놓칠 수 없는 기회!
삼성 멤버스 스타즈가 여러분의 도전을 기다립니다.#삼성멤버스스타즈 #스타즈2025모집#SamsungMembersStars
The new Galaxy S24 FE can make any big day worth it. Now packed with every feature you love from Galaxy AI.
— Samsung India (@SamsungIndia) September 27, 2024
Learn more: https://t.co/xsY82Bv4rE.#GalaxyS24 #GalaxyAI #Samsung pic.twitter.com/foWHAOLuwQ