అన్వేషించండి

Samsung Galaxy A23: శాంసంగ్ బడ్జెట్ ఫోన్లు వచ్చేశాయ్ - ధర రూ.15 వేలలోనే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. అవే శాంసంగ్ గెలాక్సీ ఏ13, ఏ23 స్మార్ట్ ఫోన్లు.

Samsung New Phones: శాంసంగ్ తన గెలాక్సీ ఏ-సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. అవే శాంసంగ్ గెలాక్సీ ఏ13, శాంసంగ్ గెలాక్సీ ఏ23. వీటిలో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. రెండు ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్ల ఫీచర్లూ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ ఫోన్లు ప్రస్తుతానికి యూరోప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఏ13, ఏ23 ధర
ఈ రెండు ఫోన్ల ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే జీఎస్ఎంఎరీనా వెబ్‌సైట్ ప్రకారం... శాంసంగ్ గెలాక్సీ ఏ13 స్మార్ట్ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 190 యూరోలుగా (సుమారు రూ.15,800) ఉండనుంది. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 210 యూరోలుగా (సుమారు రూ.17,500) నిర్ణయించనున్నారు. ఈ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయితే వీటి ధర రూ.12 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ13 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లే ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. శాంసంగ్ దీని ప్రాసెసర్‌ను ఇంకా తెలపలేదు కానీ... ఎక్సినోస్ 850 చిప్‌సెట్ అయ్యే అవకాశం ఉంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని మందం 0.88 సెంటీమీటర్లు గానూ, బరువు 195 గ్రాములుగానూ ఉండనుంది. బ్లాక్, బ్లూ, పీచ్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

శాంసంగ్ గెలాక్సీ ఏ23 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ ఫీచర్లన్నీ దాదాపు శాంసంగ్ గెలాక్సీ ఏ23 తరహాలోనే ఉండనున్నాయి. అయితే ప్రాసెసర్ విషయంలో తేడా ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ23 ప్రాసెసర్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది.

Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

టాప్ హెడ్ లైన్స్

AP Water Projects: ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Telangana Polytechnic Students Protest: పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
Sahaa Trailer : అమీర్‌పేట్‌లో గుండు గీయించుకుంటానన్న హీరోయిన్ - ఫోన్ చేసి బూతులు తిట్టండన్న హీరో... ఎందుకంటే?
అమీర్‌పేట్‌లో గుండు గీయించుకుంటానన్న హీరోయిన్ - ఫోన్ చేసి బూతులు తిట్టండన్న హీరో... ఎందుకంటే?

వీడియోలు

CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Water Projects: ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Telangana Polytechnic Students Protest: పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
Sahaa Trailer : అమీర్‌పేట్‌లో గుండు గీయించుకుంటానన్న హీరోయిన్ - ఫోన్ చేసి బూతులు తిట్టండన్న హీరో... ఎందుకంటే?
అమీర్‌పేట్‌లో గుండు గీయించుకుంటానన్న హీరోయిన్ - ఫోన్ చేసి బూతులు తిట్టండన్న హీరో... ఎందుకంటే?
Varun Tej: ఈసారి తప్పే జరగదు... నిహారికతో 'బరి'పై వరుణ్ తేజ్ సెన్సేషనల్ కామెంట్స్
ఈసారి తప్పే జరగదు... నిహారికతో 'బరి'పై వరుణ్ తేజ్ సెన్సేషనల్ కామెంట్స్
Singareni Gold Copper Exploration : బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!
బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!
Amaravati: అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
Konda Surekha BJP Join Rumors: కొండా కుటుంబం చేరేది బీజేపీ తీరానికేనా ? - ప్లాన్ బి వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
కొండా కుటుంబం చేరేది బీజేపీ తీరానికేనా ? - ప్లాన్ బి వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Embed widget