అన్వేషించండి

రూ.10 వేలలోపే రెడ్‌మీ కొత్త ఫోన్.. ఈసారి మరింత ‘యాక్టివ్’గా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ 9 యాక్టివ్. దీని ధర మనదేశంలో రూ.9,499 నుంచి ప్రారంభం కానుంది.

రెడ్‌మీ 9 యాక్టివ్ సేల్ మనదేశంలో ప్రారంభం అయిపోయింది. గతేడాది లాంచ్ అయిన రెడ్‌మీ 9 తరహాలోనే ఈ ఫోన్ కూడా ఉంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

రెడ్‌మీ 9 యాక్టివ్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499గా ఉండనుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. కార్బన్ బ్లాక్, కోరల్ గ్రీన్, మెటాలిక్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ స్టూడియో స్టోర్లలో ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.

Also Read: రూ.7,500లోపే రియల్‌మీ కొత్త ఫోన్.. రెండు ఫోన్లు లాంచ్.. 43 రోజుల బ్యాటరీ లైఫ్!

రెడ్‌మీ 9 యాక్టివ్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.53 అంగుళాల హెచ్‌డీ+ డాట్ డ్రాప్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా  వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.  4జీ, వైఫై, బ్లూటూత్ వీ5, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు దీని మందం 0.9 సెంటీమీటర్లుగానూ, బరువు 194 గ్రాములుగానూ ఉంది.

Also Read: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: ఐకూ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.22 వేలలోపే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
New WhatsApp Subscription Plan: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
WhatsApp Hacks:వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
WhatsApp Username: యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ నుంచి నంబర్‌ను తీసేయవచ్చా?
యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ నుంచి నంబర్‌ను తీసేయవచ్చా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Superfoods for Healthy Hair : జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
Cheating Partner : మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
Embed widget