Twitter: సగానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన ఖాయం - హింట్ ఇస్తున్న ఎలాన్ మస్క్!
ట్విట్టర్‌లో సగానికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ‘Power to the People’ అని ట్వీట్ చేశారు. ట్విట్టర్ ప్రస్తుతానికి నాలుగు మిలియన్ డాలర్ల నష్టంతో నడుస్తుందన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ సమర్థించుకున్నాడు. విధుల నుంచి తొలగించిన వారికి మూడు నెలల వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపాడు. మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ట్విట్టర్ ఉద్యోగులకు ‘తీసివేయడం ఇప్పుడే ప్రారంభం అయింది’ ఈమెయిల్స్ కూడా వచ్చాయి.
ట్విట్టర్‌లో దాదాపు సగం మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే దాదాపు 7,500 మందికి పైగా. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ దాదాపు 44 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టారు. ట్విట్టర్ చేతిలోకి రాగానే కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మొత్తాన్ని తొలగించారు.
ట్విట్టర్‌లో ఉద్యోగాల కటింగ్ గురించి కూడా ఎలాన్ మస్క్ హింట్ ఇచ్చారు. ట్విట్టర్‌లో ‘తలల సంఖ్యను క్రమబద్ధీకరణ’ చేయాలని తెలిపారు. ట్విట్టర్‌లో చేయనున్న మార్పుల గురించి కూడా చర్చించాడు. కంటెంట్ మోడరేషన్ విషయంలో ట్విట్టర్ కమిట్‌మెంట్ మారబోదన్నారు.
ఇటీవలే ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఎలాంటి "స్పష్టమైన ప్రక్రియ" లేకుండా బ్యాన్ చేసిన ఖాతాలను పునరుద్ధరించబోమని చెప్పారు. వాటిని పునరుద్ధరించడానికి కనీసం మరికొన్ని వారాలు పడుతుందన్నారు. మస్క్ మరొక ట్వీట్‌తో దీనిపై "స్పష్టమైన ప్రక్రియ" ఉండవచ్చని పేర్కొన్నాడు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram
View this post on Instagram