అన్వేషించండి

Poco M4 Pro 4G Sale: పోకో కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.15 వేలలోపే సూపర్ ఫీచర్లు - రూ.1,000 ఆఫర్ కూడా!

పోకో ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన ఎం4 ప్రో 4జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Poco M4 Pro 4G: పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. మీడియాటెక్ హీలియో జీ96 (Mediatek Helio G96) ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

పోకో ఎం4 ప్రో 4జీ ధర (Poco M4 Pro 4G Offers)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ రూ.17,999గా నిర్ణయించారు. కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో పోకో ఎం4 ప్రో 5జీని కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది.

పోకో ఎం4 ప్రో 4జీ ఫీచర్లు (Poco M4 Pro 4G Features)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎం4 ప్రో 5జీ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందించింది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇక ర్యామ్‌ను కూడా డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా 11 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

పోకో ఎం4 ప్రో 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 61 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది.  4జీ ఎల్టీఈ, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 179.5 గ్రాములుగా ఉంది.

Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

టాప్ హెడ్ లైన్స్

Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget