Oppo Watch Free: ఒప్పో బడ్జెట్ వాచ్ వచ్చేసింది! గురక పెట్టినా చెప్పేస్తుంది, ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో తన స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. అదే ఒప్పో వాచ్ ఫ్రీ.
ఒప్పో తన స్మార్ట్ వాచ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో వాచ్ ఫ్రీ. ఈ స్మార్ట్ వాచ్ 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఐదు నిమిషాలు చార్జ్ పెడితే ఒక రోజు బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
ఒప్పో వాచ్ ఫ్రీ ధర
ఈ వాచ్ ధరను మనదేశంలో రూ.5,999గా నిర్ణయించారు. బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. అయితే ఈ వాచ్ సేల్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఒప్పో వాచ్ ఫ్రీ స్పెసిఫికేషన్లు
ఇందులో 1.64 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. టచ్ సపోర్ట్, డీసీఐ-పీ3 కలర్ గాముట్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్‌ను కూడా అందించారు. బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 6.0, ఐవోఎస్ 10.0 లేదా ఆ పైన ఆపరేటింగ్ సిస్టంలను ఇది సపోర్ట్ చేయనుంది.
ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం ఇందులో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉండనున్నాయి. బ్యాడ్మింటన్, క్రికెట్, స్కీయింగ్ వంటి స్పోర్ట్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్ కూడా అందించారు. బ్లడ్ ఆక్సిజన్ స్థాయిని కూడా ఇది కొలవగలదు. దీంతోపాటు నిద్ర, గురకను కూడా ఇది గుర్తించగలదు.ః
వాటర్ ప్రూఫ్ బిల్డ్‌తో దీన్ని రూపొందించారు. 50 మీటర్ల లోతు వరకు వరకు నీటిలో వీటిని ఉపయోగించవచ్చు. ఇందులో యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 230 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 1.06 సెంటీమీటర్లు కాగా.. బరువు 33 గ్రాములుగా ఉంది.
View this post on Instagram