అన్వేషించండి

OnePlus 9RT: వన్‌ప్లస్ 9ఆర్‌టీలో ఈ ఫీచర్లు పక్కా.. అదిరిపోయే న్యూస్ చెప్పిన కంపెనీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ వన్‌ప్లస్ 9ఆర్‌టీని త్వరలో లాంచ్ చేయనుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్లను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది.

వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్ అక్టోబర్ 13వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉండనున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 9ఆర్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మొదట చైనాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అప్పుడే మనదేశంలో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్పెసిఫికేషన్లు
వీబోలో పోస్ట్ చేసిన టీజర్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ శాంసంగ్ ఈ4 డిస్‌ప్లే ఉండనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 65టీ వార్ప్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్ కూడా ఇందులో ఉండనుంది. మూడు షేడ్లలో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీని అక్టోబర్ 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.

వన్‌ప్లస్ 9ఆర్‌టీతో పాటు కొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ కూడా మనదేశంలో లాంచ్ కానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌లో 40 డెసిబల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండనుంది. మిగతా వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది..

చైనాలో వన్ ప్లస్ 9ఆర్‌టీ, వన్‌ప్లస్ జెడ్2కు సంబంధించిన సేల్ అక్టోబర్ 19వ తేదీ నుంచి జరగనుంది. మనదేశంలో కూడా అక్టోబర్ 13వ తేదీన లాంచ్ అయితే.. అక్టోబర్ 19వ తేదీన మనదేశంలో కూడా సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇవి కచ్చితంగా మనదేశంలో లాంచ్ అయితే అవుతాయి.. కానీ ఎప్పుడు లాంచ్ అవుతాయనేదే సస్పెన్స్!

Also Read: Smart Watch Offers: రూ.1,000 లోపే స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్లు.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్లు

Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?

Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget