అన్వేషించండి

MrBeast 500 Million YouTube Subscribers:యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!

యూట్యూబ్ చరిత్రలో 50 కోట్ల సబ్‌స్క్రైబర్‌ మైలురాయిని అందుకున్న తొలి వ్యక్తిగా మిస్టర్ బీస్ట్ రికార్డు సృష్టించారు. అతని అద్భుత ప్రయాణం, బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం గురించి తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జిమ్మీ డొనాల్డ్‌సన్ 50 కోట్ల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ల రికార్డు సాధించారు.
  • వ్యాపారాల ద్వారా ఆర్జించిన ఆదాయం వీడియోల నాణ్యతకు వెచ్చిస్తారు.
  • పర్యావరణ, సామాజిక సేవలకు వందల కోట్లు నిధులు వెచ్చిస్తున్నారు.
  • యూట్యూబ్‌ చరిత్రలో 50 కోట్ల సబ్‌స్క్రైబ్లను సాధించిన మొదటి వ్యక్తిగత క్రియేటర్‌గా జిమ్మీ డొనాల్డ్‌సన్ ప్రపంచ రికార్డు
  • కేవలం వీడియోలే కాకుండా ఫీస్టబుల్స్, బీస్ట్ బర్గర్ వంటి వ్యాపారాల ద్వారా ఏడాదికి 600-700 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు. 
  • టీమ్ ట్రీస్, టీమ్‌ సీస్, టీమ్ వాటర్ వంటి భారీ కార్యక్రమాల ద్వారా పర్యావరణ, సామాజిక సేవ కోసం వందల కోట్లు వెచ్చిస్తున్నాడు. 

జూన్ 12న డిజిటల్ ప్రపంచం ఒక అద్భుతమైన క్షణానికి సాక్ష్యంగా నిలిచింది. జిమ్మీ డొనాల్డ్ సన్ ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బీస్ట్‌గా పిలుచుకునే యువకుడు, యూట్యూబ్‌లో 500 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌ల మార్కును దాటారు. ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగత క్రియేటర్‌గా రికార్డు సృష్టించారు. లైవ్ స్ట్రీమ్ ద్వారా ఈ చారిత్రాత్మక లక్షలాది మంది వీక్షించారు. యూట్యూబ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఇతర వ్యక్తిగత ఛానెల్‌ కూడా ఈ స్థాయికి చేరుకోలేదు. ఇది కేవలం ఒక అంకం మాత్రమేకాదు ఒక కొత్త డిజిటల్ యుగానికి ఆరంభం. 

13 ఏళ్ల వయసులో ప్రారంభం...

2012లో కేవలం 13 ఏళ్ల వయసులో జిమ్మీ తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట్లో MrBeast6000 పేరుతో చిన్న చిన్న వీడియోలు చేసేవారు. అయితే 2017లో ఆయన చేసిన నే లక్ష వరకు లెక్కపెట్టాను అనే వీడియో ఆయన జీవితాన్ని మార్చేసింది. దాదాపు 40 గంటల పాటు సాగిన ఆ వీడియో వైరల్‌గా మారింది. యూట్యూబ్ అల్గారిథమ్‌ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి జిమ్మీ రోజుకు పది గంటలకుపైగా శ్రమించే వారు. వైరాలిటీ వెనుక ఉన్న సీక్రెట్స్ శోధించడమే ఆయన విజయానికి కారణం. 

బీస్ట్ ఇండస్ట్రీస్ 

మిస్టర్ బీస్ట్‌ కేవలం ఒక యూట్యూబర్ మాత్రమే కాదు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఆయన స్థాపించిన బీస్ట్ ఇండస్ట్రీస్‌ విలువ ప్రస్తుతం 5బిలియిన్ డాలర్లుగా అంచనా. ఆయన చాక్లెట్ బ్రాండ్ ఫీస్టబుల్ ఏటా 200 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇది వాల్ మార్ట్ వంటి భారీ స్టోర్లలో అందుబాటులో ఉంది. దీంతోపాటు మిస్టర్ బీస్ట్ బర్గర్, కొత్తగా లాంచ్ చేసిన లంచ్లీ ఫుడ్ సెక్టార్‌లో సంచలనంగా మారింది. 

ఆదాయం ఎలా ఖర్చు చేస్తున్నట్టు?

చాలా మందికి వచ్చే సందేహం, జిమ్మీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రకటనలు, బ్రాండ్స్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆయన భారీగా సంపాదిస్తారు. కానీ ఆయన ప్రత్యేకత ఏంటంటే, వచ్చిన ఆదాయంలో 80-90శాతం తిరిగి వీడియోల తయారీకే ఖర్చు చేస్తారు. ఒక్కో వీడియోకు మిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చిస్తారు. పెద్ద పెద్ద సెట్లు నిర్మించడం, భారీ బహుమతులు ఇవ్వడం ద్వారా ఆయన తన కంటెంట్ నాణ్యత పెంచుకుంటూ పోతున్నారు. ఇదే ఆయనను ఇతరులకు భిన్నంగా నిలబెడుతోంది.    

సేవలోనూ బీస్ట్ మార్క్ 

జిమ్మీ హృదయం కూడా ఆయన వీడియోలంతే పెద్దది. బీస్ట్ ఫిలాంత్రోఫి ద్వారా ఆయన వేలాది మందికి సహాయం చేస్తున్నారు. వెయ్యి మంది అంధులకు చూపు తెప్పించారు. ఆఫ్రికాలో 100 బావులు తవ్వించారు. పర్యావరణ కోసం టీమ్‌ ట్రీస్, టీమ్‌ సీస్‌ , టీమ్ వాటర్ ప్రచారాల ద్వారా వందల కోట్లు నిధులు సేకరించి మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

వివాదాల్లోనూ బీస్ట్ 

జిమ్మీ వద్ద పని వాతావరణం సరిగా లేదని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందించిన బీస్ట్ గేమ్సక్ విషయంలోనూ కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి.మెక్సికోలోని మాయన్ శిథిలాల వద్ద అనుమతి లేకుండా షూటింగ్ చేశారనే విమర్శలు ఉన్నాయి. 

భవిష్యత్‌ లక్ష్యం ఏంటీ?

జిమ్మీ లక్ష్యం కేవలం 50 కోట్లే కాదు, భవిష్యత్‌లో వంద కోట్ల సబ్‌స్క్రైబర్లను చేరుకోవాలనే ఆయన కల. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి నేడు బిలియనీర్‌గా ఎదిగిన జమ్మీ ప్రయాణం కోట్లాది మంది క్రియేటర్లకు స్ఫూర్తిదాయకం.  

Frequently Asked Questions

మిస్టర్ బీస్ట్ ఎవరు మరియు అతను సాధించిన ప్రపంచ రికార్డు ఏమిటి?

మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్. యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించిన మొదటి వ్యక్తిగత క్రియేటర్‌గా అతను ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను జూన్ 12న సాధించాడు.

మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ప్రయాణం ఎప్పుడు ప్రారంభించారు, ఎలా ప్రసిద్ధి చెందారు?

జిమ్మీ 2012లో, 13 ఏళ్ల వయసులో తన యూట్యూబ్ ప్రయాణం ప్రారంభించారు. 2017లో ఆయన చేసిన

మిస్టర్ బీస్ట్ వ్యాపారాలు ఏమిటి మరియు అతని కంపెనీ విలువ ఎంత?

మిస్టర్ బీస్ట్ కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. అతని బీస్ట్ ఇండస్ట్రీస్ విలువ ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లుగా అంచనా. ఫీస్టబుల్స్, బీస్ట్ బర్గర్ మరియు లంచ్లీ అతని ప్రధాన వ్యాపారాలు.

మిస్టర్ బీస్ట్ తన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తారు?

జిమ్మీ ప్రకటనలు మరియు బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా భారీగా సంపాదిస్తాడు. వచ్చిన ఆదాయంలో 80-90% తిరిగి వీడియోల తయారీకే ఖర్చు చేస్తూ, తన కంటెంట్ నాణ్యతను పెంచుతాడు.

మిస్టర్ బీస్ట్ ఏ రకమైన సామాజిక సేవలను అందిస్తున్నారు?

జిమ్మీ బీస్ట్ ఫిలాంత్రోపీ ద్వారా వేలాది మందికి సహాయం చేస్తున్నారు. వెయ్యి మంది అంధులకు చూపు తెప్పించారు, ఆఫ్రికాలో 100 బావులు తవ్వించారు. పర్యావరణ ప్రచారాలకు వందల కోట్లు నిధులు సేకరించారు.

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget