అన్వేషించండి

Motorola Frontier 22: 200 మెగాపిక్సెల్ కెమెరాతో మోటొరోలా కొత్త ఫోన్.. 50, 60 ఎంపీ కెమెరాలు కూడా.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా 200 మెగాపిక్సెల్ కెమెరాతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మోటొరోలా ప్రస్తుతం ‘ఫ్రంటియర్ 22’ అనే కోడ్‌నేమ్‌తో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. వీటి ప్రకారం ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ప్రధాన కెమెరాగా 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం జులైలో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అదే జరిగితే 200 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రపంచంలో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 125W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఈ ఫోన్ 5సపోర్ట్ చేయనుంది.

హోల్ పంచ్ కటౌట్‌లో సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. వెనకవైపు మూడు కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. జర్మనీకి చెందిన ఒక ప్రముఖ వెబ్‌సైట్‌లో దీని వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

మోటొరోలా ఫ్రంటియర్ 22 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉండనుంది. హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ఎస్4875 అనే కోడ్ నేమ్ ఉన్న ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉండనున్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

వైఫై 6ఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్ వీ5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించనున్నారు. స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు ఇందులో ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Anganwadi notification: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Embed widget