News
News
X

Motorola Edge 30 Pro Sale: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ సేల్ ప్రారంభం - మొదటి సేల్‌లో ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా మనదేశంలో ఇటీవలే ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది.

FOLLOW US: 

మోటొరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్ ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.

మోటొరోలా ఎడ్జ్ 30 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. కాస్మోస్ బ్లూ, స్టార్ డస్ట్ వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.ఐదు వేలు తగ్గింపు లభించనుంది. దీంతోపాటు జియో వినియోగదారులకు రూ.10 వేల విలువైన లాభాలు అందించనున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా దీనిపై అందించారు.

మోటొరోలా ఎడ్జ్ 30 ప్రో స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై మోటొరోలా ఎడ్జ్ 30 ప్రో పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, డీసీఐ పీ3 కలర్ స్పేస్ కూడా ఇందులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌‌ను ఇందులో అందించారు.

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 68W టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ 0 నుంచి 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ పేర్కొంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో అందించారు. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.

Published at : 05 Mar 2022 04:07 PM (IST) Tags: Motorola Edge 30 Pro Price in India Motorola Edge 30 Pro Features Motorola Edge 30 Pro Motorola Edge 30 Pro Flipkart Sale Motorola Edge 30 Pro Sale

సంబంధిత కథనాలు

Xiaomi Smart TV 5A Pro: డాల్బీ ఆడియో, డీటీఎస్ ఫీచర్లతో షావోమీ కొత్త టీవీ - ధర రూ.17 వేలలోపే!

Xiaomi Smart TV 5A Pro: డాల్బీ ఆడియో, డీటీఎస్ ఫీచర్లతో షావోమీ కొత్త టీవీ - ధర రూ.17 వేలలోపే!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Jio 5G Phone: రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ - ప్రత్యేకతలు ఏంటంటే?

Jio 5G Phone: రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ - ప్రత్యేకతలు ఏంటంటే?

Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!

Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!

టాప్ స్టోరీస్

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

YSRCP Vs Janasena :  వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !