అన్వేషించండి

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

మోటొరోలా ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన మోటో ట్యాబ్ జీ70 ఎల్టీఈ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

మోటో ట్యాబ్ జీ70 ఎల్టీఈ ట్యాబ్లెట్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీని సేల్ కూడా మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ట్యాబ్లెట్‌లో మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. ఇందులో 11 అంగుళాల 2కే ఎల్సీడీ డిస్‌ప్లే ఉండటం విశేషం.

మోటో ట్యాబ్ జీ70 ఎల్టీఈ ధర
ఈ ట్యాబ్లెట్ ధరను రూ.21,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను మోటో ట్యాబ్ జీ70 ఎల్టీఈలో అందించారు. మోడర్‌నెయిస్ట్ టియల్ కలర్‌వే రంగులో ఈ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ ట్యాబ్లెట్ రూ.21,249కే లభించనుంది.

మోటో ట్యాబ్ జీ70 ఎల్టీఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై మోటో ట్యాబ్ జీ70 ఎల్టీఈ పనిచేయనుంది. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌పై ఇది పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ ఇందులో అందుబాటులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం. ఇందులో 11 అంగుళాల ఐపీఎస్ 2కే ఎల్సీడీ డిస్‌ప్లేను మోటొరోలా అందించింది.

ఈ ట్యాబ్లెట్‌లో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, హాల్ ఎఫెక్ట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్లు కూడా ఈ ట్యాబ్లెట్‌లో అందించారు. 

దీని బ్యాటరీ సామర్థ్యం 7700 ఎంఏహెచ్‌గా ఉండగా, 20W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో నాలుగు స్పీకర్ల సెటప్‌ను అందించారు. ఇందులో ప్రత్యేకమైన గూగుల్ కిడ్స్ స్పేస్ కూడా ఉందని మోటొరోలా తెలిపింది. ఈ ట్యాబ్లెట్ మందం 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 490 గ్రాములుగా ఉంది.

Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
Vandemataram Srinivas : హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
Vandemataram Srinivas : హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ
Rahul Ravindran Chinmayi : పుణె మర్డర్‌పై బాయ్ ఫ్రెండ్ మూవీ - నెటిజన్‌కు రాహుల్ రిప్లై... సెటైరికల్ క్వశ్చన్‌కు చిన్మయి కౌంటర్
పుణె మర్డర్‌పై బాయ్ ఫ్రెండ్ మూవీ - నెటిజన్‌కు రాహుల్ రిప్లై... సెటైరికల్ క్వశ్చన్‌కు చిన్మయి కౌంటర్
ఇంటి గోడలకు మేకులు కొడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశలో మేకులు కొట్టకూడదని మీకు తెలుసా?
ఇంటి గోడలకు మేకులు కొడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశలో మేకులు కొట్టకూడదని మీకు తెలుసా?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
Embed widget