News
News
X

Xiaomi 12S Ultra: వన్‌ప్లస్, యాపిల్‌తో పోటీ పడే ఫోన్ లాంచ్ చేసిన షియోమీ!

యాపిల్, వన్‌ప్లస్‌లతో పోటీ పడటం కోసం షియోమీ తన బెస్ట్ ఫోన్ లాంచ్ చేసింది.

FOLLOW US: 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  షియోమీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే షియోమీ 12ఎస్ అల్ట్రా. ఈ ఫోన్ వెనకవైపు ఒక అంగుళం సైజు ఉన్న లెయికా కెమెరాను ఈ ఫోన్‌లో అందించారు. అదే ఈ ఫోన్‌లో ప్రధాన ఫీచర్. వన్‌ప్లస్ 10 ప్రో, ఐకూ 9 ప్రోలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.

షియోమీ 12ఎస్ అల్ట్రా ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 యువాన్లుగానూ (సుమారు రూ.70,700), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,499 యువాన్లుగానూ (సుమారు రూ.76,600) నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 యువాన్లుగా (సుమారు రూ.82,500) ఉంది.

షియోమీ 12ఎస్ అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై షియోమీ 12ఎస్ అల్ట్రా పనిచేయనుంది. ఇందులో 6.73 అంగుళాల 2కే మైక్రో కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌తో పాటు ఎల్టీపీవో టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.

12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ షియోమీ 12ఎస్ అల్ట్రాలో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పైనే ఈ స్మార్ట్ ఫోన్ కూడా పనిచేయనుంది. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా... బరువు 225 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... షియోమీ 12ఎస్ అల్ట్రాలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా ఒక ఇంచ్ ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్989 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఐఆర్ బ్లాస్టర్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4860 ఎంఏహెచ్ కాగా... 67W వైర్డ్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌ను షియోమీ 12ఎస్ అల్ట్రా సపోర్ట్ చేయనుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 05 Jul 2022 01:52 AM (IST) Tags: Xiaomi 12S Ultra Xiaomi 12S Ultra Price Xiaomi 12S Ultra Launched Xiaomi 12S Ultra Features Xiaomi 12S Ultra Specifications

సంబంధిత కథనాలు

Moto G62 5G Flipkart Sale: మోటొరోలా కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.18 వేలలోనే 5జీ ఫోన్!

Moto G62 5G Flipkart Sale: మోటొరోలా కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.18 వేలలోనే 5జీ ఫోన్!

Nothing Phone 1: బ్రాండ్ లవర్స్‌కు నథింగ్ షాక్ - ఫోన్ రేట్ పెంపు - ఎంతంటే?

Nothing Phone 1: బ్రాండ్ లవర్స్‌కు నథింగ్ షాక్ - ఫోన్ రేట్ పెంపు - ఎంతంటే?

50 మెగాపిక్సెల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

50 మెగాపిక్సెల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Realme GT Neo 3T: వావ్ అనిపించే కొత్త ఫోన్ తీసుకురానున్న రియల్‌మీ - ఆ ఒక్కటే సస్పెన్స్!

Realme GT Neo 3T: వావ్ అనిపించే కొత్త ఫోన్ తీసుకురానున్న రియల్‌మీ - ఆ ఒక్కటే సస్పెన్స్!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

టాప్ స్టోరీస్

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!