అన్వేషించండి

Xiaomi 12S: సూపర్ కెమెరాలతో షియోమీ కొత్త ఫోన్లు - వచ్చే వారమే లాంచ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.

కెమెరా బ్రాండ్ లెయికాతో షియోమీ కొన్ని నెలల క్రితమే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి భాగస్వామ్యంలో మొదటి ఫోన్ రానుంది. జులై 4వ తేదీన లాంచ్ కానున్న షియోమీ 12ఎస్‌ను వీరి భాగస్వామ్యంలో మొదటిగా లాంచ్ చేయనున్నారు. షియోమీ 12ఎస్ అల్ట్రా స్మార్ట్ ఫోన్ కూడా ఈ సిరీస్‌లో లాంచ్ కానుంది.

షియోమీ సీఈవో లెయ్ జున్ ఈ విషయాన్ని వీబో ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. ఈ సిరీస్‌లో షియోమీ 12ఎస్, షియోమీ 12ఎస్ ప్రో, షియోమీ 12ఎస్ అల్ట్రా ఉండనున్నాయి. అసుస్ రోగ్ ఫోన్ 6 లాంచ్‌కు రెండు రోజుల ముందు షియోమీ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. కాబట్టి క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1తో లాంచ్ కానున్న మొదటి ఫోన్లు ఇవే అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం... షియోమీ 12ఎస్ ప్రోలో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ఒక వేరియంట్‌లో డైమెన్సిటీ 9000 ప్రాసెసర్, మరో వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. ప్రో వేరియంట్2లో 120W ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది.

ఇక అల్ట్రా విషయానికి వస్తే... ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై షియోమీ 12ఎస్ అల్ట్రా పనిచేయనుంది. 8 జీబీ లేదా 12 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ లేదా 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే... షియోమీ 12 అల్ట్రాలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు ఓఐఎస్ సపోర్ట్ కూడా ఉండనుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాను ఇందులో అందించనున్నారు. 

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alvin Tse (@atytse)

టాప్ హెడ్ లైన్స్

How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Embed widget